నందిగామ: జయరామ్‌ను రాకేష్ రెడ్డి హత్య చేసినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠీ చెప్పారు.ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని ఛేదించామన్నారు. ఈ కేసులో శిఖా చౌదరికి ఎలాంటి పాత్ర లేదని ఎస్పీ స్పష్టం చేశారు.ఆర్థిక లావాదేవీల కారణంగానే జయరామ్ హత్య జరిగిందని ఎస్పీ తెలిపారు.

మంగళవారం సాయంత్రం నందిగామ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ త్రిపాఠీ  మీడియాకు వివరించారు.ఐతవరం సమీపంలో గత నెల 31వ తేదీ రాత్రి  హైవే పెట్రోల్ పోలీసులు జయరామ్ మృతదేహన్ని గుర్తించారు. ఈ కారులో ముందు, వెనుక సీటు మధ్య జయరామ్ మృతదేహం ఉన్నట్టు గుర్తించారు.

మృతదేహం  వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా బంధువులకు సమాచారం ఇచ్చినట్టు చెప్పారు. ఫిబ్రవరి1వ తేదీన జయరామ్ మామ గుత్తా పిచ్చయ్య చౌదరి ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు.

పోస్ట్ మార్టం తర్వాత  జయరామ్ మృతదేహన్ని కుటుంబసభ్యులకు అందించినట్టు చెప్పారు.  నందిగామ డిఎస్పీ ఆధ్వర్యంలో  పలు పోలీసుల టీమ్‌లు ఏర్పాటు చేసి ఈ కేసును  చేధించినట్టు చెప్పారు.సీసీటీవీ పుటేజీ, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా ఈ కేసును తేల్చినట్టు ఆయన చెప్పారు.

టెక్రాన్ సంస్థలో సమస్యలు ఉన్న సమయంలో  రాకేష్ రెడ్డితో జయరామ్ అప్పు తీసుకొన్నారు.  అయితే  అదే సమయంలో ఈ డబ్బును ఇవ్వకపోతే ఇంటిని స్వాధీనం చేసుకొంటామని రాకేష్ రెడ్డి చెప్పారు. కానీ జయరామ్ ఇంటిపై లోన్ తీసుకొన్న విషయాన్ని రాకేష్ రెడ్డి తెలుసుకొన్నట్టు చెప్పారు.

టెక్రాన్ సంస్థలో కార్మికుల సమస్యలు తలెత్తిన సమయంలో  జయరామ్ రాకేష్ రెడ్డికి  ఫోన్ చేసి శిఖా చౌదరి ఫోన్ చేస్తారు... సహకరించాలని కోరినట్టుగా జయరామ్ చెప్పారని ఎస్పీ తెలిపారు.  ఆ తర్వాత రాకేష్ రెడ్డి, శిఖా చౌదరి మధ్య సంబంధాలు కొనసాగినట్టు తెలిపారు.  ఆ తర్వాత వీరిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయన్నారు.

తన డబ్బులు చెల్లించకపోవడంతో రాకేష్ రెడ్డి ప్లాన్ చేశారని చెప్పారు.  జయరామ్ కోసం శిఖా ఇంటి వద్ద రాకేష్ రెడ్డి నిఘాను ఏర్పాటు చేశారని  చెప్పారు.గత నెల 29వ తేదీన జయరామ్ శిఖా చౌదరి ఇంటికి వెళ్లాడని చెప్పారు. ఈ విషయాన్ని వాచ్‌మెన్ రాకేష్ రెడ్డికి సమాచారం ఇచ్చారని చెప్పారు.

దీంతో ఓ అమ్మాయి పేరుతో జయరామ్‌కు  రాకేష్ రెడ్డి చాటింగ్ చేశారని ఎస్పీ చెప్పారు. ఈ చాటింగ్ ద్వారా రాకేష్ రెడ్డి ఇంటికి జయరామ్ వెళ్లినట్టు ఎస్పీ తెలిపారు. గత నెల 30 వ తేదీన రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లిన  తర్వాత డబ్బుల కోసం  కొట్టినట్టు చెప్పారు.

జయరామ్ కోరిక మేరకు ఈశ్వరప్రసాద్ రూ.6 లక్షలు చెల్లించినట్టు చెప్పారు. అయితే విజయవాడలోని కోస్టల్ బ్యాంకు నుండి డబ్బులు ఇస్తామని జయరామ్  రాకేష్ రెడ్డితో చెప్పారని ఎస్పీ వివరించారు. అయితే డబ్బుల కోసం జయరామ్‌ను సోఫాపై ముఖం వేసి నొక్కడంతో మృతి చెందారని ఆయన తెలిపారు.

ఆ తర్వాత ఇద్దరు పోలీసు అధికారులతో రాకేష్ రెడ్డి మాట్లాడినట్టుగా ఆధారాలు లభించినట్టు ఎస్పీ తెలిపారు.ఈ కేసులో ఇంకా సాక్ష్యాలను సేకరించాల్సి ఉందని ఎస్పీ తెలిపారు. ఈ హత్యలో శిఖా చౌదరికి పాత్ర ఉందనేందుకు తమకు ఆధారాలు లేవని చెప్పారు.

దర్యాప్తులో నిందితుడు చెప్పిన అంశాలను మాత్రమే ఎస్పీ వివరించారు.తమ విచారణలో తేలిన విషయాలను మాత్రం పోలీసులు ఏం తేల్చలేదు. శిఖా చౌదరిని ఈ కేసు నుండి తప్పించాల్సిన అవసరం తమకు లేదని ఎస్పీ చెప్పారు. ఈ కేసులో రాకేష్ రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన శ్రీనివాస్ అనే వాచ్‌మెన్ ను అరెస్ట్  చేశామన్నారు.
 

సంబంధిత వార్తలు

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?