హైదరాబాద్: ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసు పలు మలుపులు తిరుగుతోంది. జయరాం హత్య కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న ఆయన మేనకోడలు శిఖా చౌదరి తమ అదుపులో లేదని ఎస్పీ త్రిపాఠీ చెబుతున్నారు. ఆమెను నందిగామ రూరల్ పోలీసు స్టేషన్ కంచికర్లలో విచారిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

కాగా, శిఖా చౌదరిని కలవడానికి కబాలీ నిర్మాత వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. కబాలీ నిర్మాతకు పోలీసులు శిఖా చౌదరి కారును అప్పగించారని ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీలో వార్తలు వచ్చాయి. అయితే, జయరాంను హైదరాబాదులోనే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

హైదరాబాదులో చంపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో జయరాం శవాన్ని కారులో పడేసినట్లు వార్తలు వస్తున్నాయి. పథకంలో భాగంగానే తెలంగాణలో చంపేసి శవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వదిలేసినట్లు చెబుతున్నారు.

హత్య చేసిన తర్వాత కారులో తీసుకుని వెళ్లినట్లు భావిస్తున్నారు. 24 గంటల పాటు శవాన్ని ఎక్కడ దాచారనేది తెలియడం లేదు. జయరాం హత్య కేసు విషయంలో భారీగా డీల్ నడిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 

సంబందిత వార్తలు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు