నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
కశ్మీర్ అంతర్జాతీయ వివాదం, భారత్ నిర్ణయం సరికాదు, తిప్పికొడతాం: పాకిస్తాన్ రియాక్షన్
మోదీ ప్రభుత్వ నిర్ణయం కశ్మీరీలకు, పాకిస్థానీయులకు ఆమోద యోగ్యం కాదని తెలిపింది. భారత ప్రభుత్వ ధోరణిని తిప్పికొట్టేందుకు వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాజకీయపరమైన, దౌత్యపరమైన మార్గాల్లో మాత్రమే కశ్మీర్ సమస్యకు పరిష్కారం అని తాము నమ్ముతున్నట్లు తెలిపింది.
ఆర్టికల్ 370 రద్దు: కశ్మీర్ ప్రజలు శాంతి సామరస్యంతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ మద్దతు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాఘవేంద్ర రావు సలహాలు అక్కర్లేదు: పృథ్వీ, పోసానిపైనా కామెంట్
రాఘవేంద్ర రావు స్టయిల్ వేరు, తన స్టయిల్ వేరు అని పృథ్వీ అన్నారు. అయితే, రాఘవేంద్రరావుపై తనకు గౌరవం ఉందని చెప్పారు. ఎస్వీబీసీలో కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఆయన చెప్పారు.
జగన్ జెరుసలేం ‘యాత్ర’ మనకు ఏం చెబుతున్నది?
పదిహేనేళ్ళ క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక, 2004 మే రెండవ వారంలో కాంగ్రెస్ ప్రధానిగా యు.పి.ఏ. తన తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమయింది.
జగన్ అలా చూడొద్దు, కశ్మీర్ సమస్యే పరిష్కారం కాగా కాపు రిజర్వేషన్లు ఎంత : పవన్ కళ్యాణ్
కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు వెతుకుతున్న ప్రభుత్వాలు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలని నిలదీశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్ అంశాన్ని జగన్ రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారని విమర్శించారు.
సుఖేందర్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇదే....
తెలంగాణ సీఎం కేసీఆర్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకొనే అవకాశం ఉంది. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినట్టుగా చెబుతున్నారు.
ఒకరితో పెళ్లి.. మరొకరితో సహజీవనం...చివరకీ..
యువతితో పెళ్లికి ముందే కార్తీక్... 8 సంవత్సరాల నుంచి మరో యువతితో సహజీవనం చేస్తున్నట్లు తాజాగా ఆమెకు తెలిసింది. 8 సంవత్సరాలుగా ఆమెతో సహజీవనం చేస్తున్నప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదని సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మోసపోయామంటూ గుర్తించిన ఇద్దరు యువతులను పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భార్యను ఆసుపత్రికి చెకప్‌కు తీసుకెళ్లి: అదృశ్యమైందన్నాడు, తెల్లారి చూస్తే
భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన భర్త ఆమెను హత్య చేసి అదృశ్యమైందంటూ అందరినీ నమ్మించేందుకు కట్టుకథలు చెప్పాడు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడ గేట్ సమీపంలో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు
నిజామా బాద్ రైతు... లాటరీలో రూ.28కోట్లు గెలుచుకున్నాడు
వికాస్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ రెండేళ్లపాటు డ్రైవరుగా పనిచేశారు. కొన్ని నెలల క్రితం మరోసారి వెళ్లిన వికాస్ పని దొరకకపోవడంతో నెలన్నర క్రితం తిరిగి వచ్చేశారు. అయితే, మొదటిసారి దుబాయ్ వెళ్లినప్పుడు లాటరీ టికెట్లు కొనడం అలవాటు చేసుకున్నాడు. ఎన్నిసార్లు లాటరీ టికెట్ కొన్నా... అతనికి లాటరీ తగలకపోవడం గమనార్హం.
తాగుబోతులు వ్యాఖ్య: పవన్ కల్యాణ్ పై హైదరాబాదులో కేసు
బంజారాహిల్స్ లోని పవన్ కల్యాణ్ ఇంటి ముందు, జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ కార్యాలయం ముందు వారు ఆందోళనకు దిగారు. ఒక్కసారి మద్యంపై నిషేధం విధించిన తర్వాత ఉద్యమం ఆగిపోయిందని పవన్ కల్యాణ్ అన్నట్లు ఆరోపిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్
ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలో హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్ధితిని సమీక్షిస్తున్నామని.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రప్రభుత్వం సూచించిందని తెలంగాణ లా అండ్ ఆర్డర్ డీజీపీ జితేందర్ తెలిపారు
ఈ రోజు ఎవరూ మర్చిపోరు... కశ్మీర్ విభజనపై బీజేపీ నేత రాజాసింగ్ కామెంట్స్
జమ్మూ కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి ని తొలగిస్తూ.. ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై పలువురు మద్దతు ప్రకటిస్తుంగా... పలువురు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై రాజా సింగ్ స్పందించారు.
వారి ఆత్మలకు శాంతి.. కశ్మీర్ విభజనపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్
ఏక్ దేశ్ మీ దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి చలేగా...అంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏకంగా తన ప్రాణాలనే అర్పించారని.. ఆయన కలలు కన్న రోజు నేడు సాకారమైందని అర్వింద్ పేర్కొన్నారు. ఇది దేశ ప్రజలందరికీ పండగ రోజు అని చెప్పారు. ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకొని తిరిగే రోజు ఇదని ఆయన అన్నారు.
ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం
జమ్మూ కాశ్మీర్ లో చోటు చేసుకొన్న క్షణక్షణానికి పరిస్థితులు మారుతున్నాయి.ఇవాళ ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది.
కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు
ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్ఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. ఈ ఆర్టికల్ ను రద్దు చేయడాన్ని ఆ పార్టీ స్వాగతించింది. రాజ్యసభలో ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు.
ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు
జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం జమ్మూకాశ్మీర్‌కు అదనపు బలగాలను పంపింది. సైన్యానికి చెందిన సీ-17 రవాణా విమానంలో సోమవారం 8 వేల మంది పారామిలటరీ బలగాలను తరలించింది.
కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...
కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ లో తీవ్రవాద కార్యకలాపాలు పెల్లుబికుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని కట్టడి చేయడానికి గతంలో కూడా గట్టిగానే కృషి చేసింది భారత ప్రభుత్వం. 2019 బిజెపి మానిఫెస్టోలో కూడా ఇది చేర్చారు.
370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు
న్యూఢిల్లీ: 370 ఆర్టికల్ రద్దుతో జమ్మూలో పండింట్లు సోమవారం నాడు సంబరాలు చేసుకొన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిన వెంటనే పండింట్లు ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు.
కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ తోపాటు మరికొన్ని పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే... బీజేపీ పేరు చెబితేనే మండిపడే కేజ్రీవాల్ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం గమనార్హం.
జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్
కశ్మీర్ విభజన తాను కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చారు. హోంమంత్రి అమిత్ షా జమ్ము కశ్మీర్ పై అణుబాంబు వేశారంటూ మండిపడ్డారు. పారామిలటరీ బలగాలను పెద్ద ఎత్తున పంపారని విమర్శించారు. అమర్ నాథ్ యాత్రికులను సైతం భయపెట్టి వెనక్కి పంపారంటూ విరుచుకుపడ్డారు.
సర్వే: గవర్నర్ పాలనపై కాశ్మీరీల సంతృప్తి
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలనపై ప్రజలు సంతృప్తితో ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆసియానెట్ సర్వే నిర్వహించింది.
మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత అడ్వాణీ స్వాగతించారు. ఆర్టికల్ 370 రద్దుపై సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగంటూ అడ్వాణీ అభివర్ణించారు.
హనీమూన్ ఫొటోలు లీక్, ‘పెళ్లి చేసుకున్నా’.. అని ఒప్పుకుంది
రాఖీ తన పెళ్లిపై క్లారిటీ ఇస్తూ.. ‘, చిత్ర పరిశ్రమ చిత్రమైనదని, పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గుతాయని నాకు చాలా భయమేసింది, అందుకే సీక్రెట్‌గా ఉంచా ,ఇకపై సినిమా ఛాన్స్‌లు వస్తాయో రావో తెలియదు, ఇదో బాధే, అయితే నా కలలకు తగ్గ వ్యక్తిని కట్టుకున్నందుకు పడుతున్న సంతోషం గా ఉంది.
మరీ ఇంత హాటా.. ప్రియాంకా చోప్రా బికినీ రచ్చ!
ప్రియాంక చోప్రా స్విమ్ షూట్‌లో స్టైల్‌గా నడుచుకుంటూ వస్తోన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రియాంక అందం పిచ్చెక్కిస్తోంది.
సునీల్ కి హ్యాండ్ ఇచ్చేసిన త్రివిక్రమ్!
సునీల్ కోసం ఓ రోల్ రాసుకున్నాడు త్రివిక్రమ్. ఆ పాత్ర రావు రమేష్ తో కలిసి ఉంటుందట. కానీ రావు రమేష్ కి డేట్స్ క్లాష్ వచ్చి సినిమా నుండి తప్పుకున్నారు.
‘లాయర్ సాబ్’ టైటిల్ తో బాలయ్య కొత్త చిత్రం!
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. హిందీ లో హిట్ అయిన పింక్ సినిమా ఆధారంగా తమిళంలో రెడీ అయిన నెర్కొండ పర్వాయ్ సినిమా ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా చేసిన ఈ చిత్రానికి అక్కడ మంచి క్రేజ్ వచ్చింది. ఇంకా రిలీజ్ కానీ ఈ సినిమా మీద అక్కడ మంచి ఎక్సపెక్టేషన్స్ వున్నాయి.
త్రివిక్రమ్ తో నాగ్ సమస్యేంటి..?
'మన్మథుడు' సినిమా టీంని 'మన్మథుడు 2' ప్రీరిలీజ్ ఈవెంట్ కి పిలవాలనుకున్నప్పుడు త్రివిక్రమ్ ను నాగార్జున ఆహ్వానించారా లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ త్రివిక్రమ్ రాలేని పరిస్థితుల్లో ఉన్న ఆ సంగతి నాగ్ స్టేజ్ మీదే చెప్పేవారు.
యాంకర్ శ్యామల.. క్లీవేజ్ షో రచ్చ!
'మన్మథుడు 2' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకరింగ్ చేసింది శ్యామల.. ఈవెంట్ కోసం అమ్మడు చాలా అందంగా రెడీ అయి వచ్చింది. లైట్ పింక్ కలర్ డిజైనర్ వేర్ ఫ్రాక్ ధరించింది. ఈ గౌను ఆమె క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది.
త్రివిక్రమ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. క్రేజీ కాంబినేషన్ లో సినిమా!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు. అంటే మరో ఏడాది వరకు ఎన్టీఆర్ డేట్స్ ఖాళీగా ఉండవు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి నుంచి ప్లానింగ్ మొదలుపెట్టేశాడు.
బిగ్ బాస్ ఇంటి గుట్టు రట్టు.. బాంబు పేల్చిన జాఫర్!
కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రోజు రోజుకు ఉత్కంఠగా మారుతోంది. టైటిల్ రేసులో ఉన్నదెవరో ఆడియన్స్ కు ఇంతవరకు ఓ క్లారిటీ రావడం లేదు. హౌస్ లో ఉన్న అందరూ తమకు తోచిన విధంగా అటెన్షన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో టీవీ9 జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. \
యాంకర్ రష్మి కొత్త రూటు.. వర్కవుట్ అవుతుందా..?
బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంటుంది. కానీ వెండితెరపై ఆమెకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. అందుకే డిజిటల్ రంగంలో తన సత్తా చాటాలని అనుకుంటోంది.
టాలీవుడ్ 'లస్ట్ స్టోరీస్'.. ఆ నలుగురు దర్శకులతో డీల్..?
తెలుగులో కూడా ఓ సిరీస్ రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సందీప్ రెడ్డి వంగ, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి వంటి దర్శకులను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 5, 2019, 6:19 PM IST