కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో రోజు రోజుకు ఉత్కంఠగా మారుతోంది. టైటిల్ రేసులో ఉన్నదెవరో ఆడియన్స్ కు ఇంతవరకు ఓ క్లారిటీ రావడం లేదు. హౌస్ లో ఉన్న అందరూ తమకు తోచిన విధంగా అటెన్షన్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో టీవీ9 జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు. 

జాఫర్ బిగ్ బాస్ నుంచి వెళుతూ వెళుతూ నాగార్జునతో హౌస్ లో జరుగుతున్న కొన్ని ఆసక్తికర విషయాలని బయటపెట్టాడు. జాఫర్ బిగ్ బాస్ హౌస్ ని వీడిన విధానం నాటకీయంగా జరిగింది. వరుణ్ సందేశ్ కు జాఫర్ ఓ ఓ రకమైన వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. గేటు నుంచి బయటకు వెళుతూ..' వరుణ్.. బాబా మాస్టర్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎప్పుడూ అనొద్దు'. కన్నీరు పెట్టుకుంటూనే వితికని కూడా విమర్శించాడు. 'శ్రీముఖితో గొడవ పెట్టుకోవద్దు' అని వితికకు తెలిపాడు. 

జాఫర్ ఇంటి నుంచి వెళుతూ చేసిన ఈ వ్యాఖ్యలు సభ్యుల్లో కాస్త గందరగోళాన్ని నింపాయి. ఇక వేదికపైకి వెళ్లిన జాఫర్ కాసేపు ఇంటి సభ్యులని ముఖా ముఖి చేశారు. వీరందరిలో వరుణ్ ని అడిగిన ప్రశ్న భిన్నమైంది. హౌస్ లో గ్రూపులు ఉన్నాయా అని ప్రశ్నించాడు. 

హౌస్ లో వరుణ్ కెప్టెన్ అయితే రాహుల్ వైస్ కెప్టెన్ అని వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉన్నట్లు జాఫర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు. చివర్లో బిగ్ బాస్ హౌస్ లో ఇంటి సభ్యుల మధ్య గ్రూపులు ఉన్నాయని నాగార్జునతో పెద్ద బాంబే పేల్చాడు జాఫర్. 

వితిక, వరుణ్, రాహుల్, పునర్నవి ఓ గ్రూపుగా ఉన్నట్లు ఇప్పటికే అభిమానుల్లో చర్చ జరుగుతోంది. శ్రీముఖి, అలీ రెజా ఒకరికొకరు మద్దత్తు తెలుపుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఈ గ్రూపులు ఎలా ఉంటాయో చూద్దాం అని నాగార్జున షోని ముగించాడు.