Asianet News TeluguAsianet News Telugu

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం జమ్మూకాశ్మీర్‌కు అదనపు బలగాలను పంపింది. సైన్యానికి చెందిన సీ-17 రవాణా విమానంలో సోమవారం 8 వేల మంది పారామిలటరీ బలగాలను తరలించింది.

Article 370 Scrapping: 8,000 paramilitary Troops Being Sent To Jammu kashmir
Author
Srinagar, First Published Aug 5, 2019, 1:26 PM IST

జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని కశ్మీర్ ప్రజలు జీర్ణించుకునే అవకాశం లేకపోవడంతో పాటు సరిహద్దుల్లో ఉగ్రవాదులు పంజా విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం జమ్మూకాశ్మీర్‌కు అదనపు బలగాలను పంపింది. సైన్యానికి చెందిన సీ-17 రవాణా విమానంలో సోమవారం 8 వేల మంది పారామిలటరీ బలగాలను తరలించింది.

కాగా కాశ్మీర్‌లో కేంద్రం ఇప్పటికే 35 వేలమంది సైనికులను మోహరించింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్ధుల్లా, సాజద్ లోన్‌లను సోమవారం గృహ నిర్బంధంలో ఉంచారు.

ల్యాండ్‌లైన్, సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్ సర్వీసులను నిలిపివేసింది. అయితే అధికారులకు మాత్రం అత్యవసర పరిస్ధితుల్లో ఉపయోగించుకోవడానికి శాటిలైట్ ఫోన్లను అందించారు. దీనికి తోడు కాశ్మీర్ వ్యాప్తంగా వీధుల్లో సభలు, సమావేశాలు, ధర్నాలను నిషేధించారు.

శుక్రవారం నుంచే అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకులను కాశ్మీర్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో పెట్రోల్ సహా ఇతర నిత్యావసరాల కోసం జనం మార్కెట్ల వద్ద బారులు తీరుతున్నారు. 

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

Follow Us:
Download App:
  • android
  • ios