జమ్మూ కశ్మీర్ కోసం త్యాగాలు చేసిన ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మలు నేడు శాంతిస్తాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.  జమ్మూ కశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  జమ్మూ కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి ని తొలగిస్తూ..  ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై పలువురు మద్దతు ప్రకటిస్తుంగా... పలువురు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందించారు.

ఏక్ దేశ్ మీ దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్  నహి చలేగా...అంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఏకంగా తన ప్రాణాలనే అర్పించారని.. ఆయన కలలు కన్న రోజు నేడు సాకారమైందని అర్వింద్ పేర్కొన్నారు. ఇది దేశ ప్రజలందరికీ పండగ రోజు అని చెప్పారు. ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకొని తిరిగే రోజు ఇదని ఆయన అన్నారు. 

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంబరాలు జరుపుకోవాల్సిన రోజిదని అన్నారు. దీనిని మోదీ, అమిత్ షాలు మాత్రమే సాకారం చేశారని.. ఇది వారికి మాత్రమే సాధ్యమని అన్నారు. కాశ్మీర్ ఈ దేశంలోనే లేదన్న తెరాస నాయకురాలికి, వోట్ బ్యాంక్ రాజకీయాలు చేసే మజ్లీస్ కు ఈ నిర్ణయం చెంపపెట్టు లాంటిదన్నారు.

 కాంగ్రెస్ వాళ్లు నెహ్రూని మోడ్రన్ ఇండియా ఆర్కిటెక్చర్ అంటారని.. అయితే నెహ్రూ కాశ్మీర్ ను అల్లకల్లోలం చేసి చేతకాక  POK ఏర్పాటు చేశారని విమర్శించారు. బాంగ్లాదేశ్ , పాకిస్థాన్ ను విడదీయడాన్నీ.. ఆర్కిటెక్చర్ అనరని ..కార్పెంటరీ అంటారని ఎద్దేవా చేశారు. 

అఖండ భారత నిర్మాణం లో భరతమాత కుడి, ఎడమ భుజాలుగా  నిలబడుతోన్న మోడీ , అమిత్ షా ద్వయానికి దేశం మద్దతుగా నిలవాలని కోరుతున్నానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 

related news

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్