గత వారం రోజులుగా   బాలీవుడ్‌ నటి ,ఐటం గర్ల్  రాఖీ సావంత్‌ వివాహ విషయం హాట్ టాపిక్ గా మీడియాలో నలుగుతోంది.  ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ముంబైలోని ఓ హోటల్ లో ఓ ఎన్నారైతో రాఖీకి వివాహం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే  ఈప్రచారంపై రాఖీ క్లారిటీ ఇచ్చింది. తనకు పెళ్లి కాలేదని స్పష్టం చేసింది. హోటల్‌ లో బ్రైడల్‌ ఫొటోషూట్‌ లో మాత్రమే తాను పాల్గొన్నట్లు తెలిపింది బ్రైడల్‌ షూట్‌ జరిగిందని...తనకు పెళ్లి జరిగిపోయిందని జనాలు ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదన్నారు.

తనకు వివాహం కాలేదని, ఎవరితోనూ ప్రేమలో లేనని,  సింగిల్‌గా ఉన్నానని చెప్పారు. అయితే ఇదంతా అబద్దమే అని తేలింది. తనకు పెళ్లైందని స్వయంగా రాఖీ సావంత్ ఒప్పుకుంది.  అందుకు కారణం  ఆమె హనీమూన్‌ ఫొటోలు  వైరల్‌గా మారటమే. 

రాఖీ తన పెళ్లిపై  క్లారిటీ ఇస్తూ.. ‘, చిత్ర పరిశ్రమ చిత్రమైనదని, పెళ్లి చేసుకుంటే   అవకాశాలు తగ్గుతాయని నాకు చాలా భయమేసింది, అందుకే  సీక్రెట్‌గా ఉంచా ,ఇకపై సినిమా ఛాన్స్‌లు వస్తాయో రావో తెలియదు, ఇదో బాధే, అయితే నా కలలకు తగ్గ వ్యక్తిని కట్టుకున్నందుకు పడుతున్న సంతోషం గా ఉంది.   

నా భర్త పేరు రితేష్‌. ఆయనది యూకే.  ఆయన వివాహంతర్వాత యూకే వెళ్లిపోయారు. నా వీసా రావాల్సి ఉంది. ఆ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత నేను ఆయన దగ్గరికి వెళ్తా. అక్కడే మేం స్థిరపడుతాం. టీవీ షోలను నిర్మించాలనేది నా కల. అది ఇక తీరబోతోంది. నాకు అద్భుతమైన భర్తను ఇచ్చినందుకు ఆ దేవుడికి ధాంక్స్ తెలుపుతున్నా. 

ప్రభు చావ్లాతో నా తొలి ఇంటర్వ్యూ చూసినప్పటి నుంచి ఆయన నాకు అభిమాని. అప్పుడే నాకు మెసేజ్‌ చేశారు. అప్పుడే నేనూ తొలిసారి మాట్లాడాను. కొన్నాళ్లు స్నేహంగా ఉన్నాం. ఒకటిన్నర సంవత్సరం ముందు జరిగిన కథ ఇది. రితేష్‌ గురించి పూర్తిగా తెలిసిన తర్వాత అతడికి భార్య కావాలని దేవుడ్ని ప్రార్థించా. ఆ కల నెరవేరింది’ అని పేర్కొన్నారు.