ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు సినిమాల కంటే వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. సెన్సార్ సమస్యలు లేకపోవడం.. చెప్పాలనుకున్న కథను యధాతథంగా తెరకెక్కించదానికి ఛాన్స్ ఉండడంతో ఎక్కువమంది దర్శకులు, నటీనటులు వెబ్ సిరీస్ లపై దృష్టి పెడుతున్నారు.

కియారా అద్వానీ లాంటి తారలు కూడా డిజిటల్ మీడియాకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. దశాబ్ద కాలంగా హీరోయిన్ గా వెలుగొందుతోన్న కాజల్ కూడా ఇప్పుడు డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తోంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయనున్న వెబ్ సిరీస్ లో కాజల్ నటించబోతుందని సమాచారం.

ఇప్పుడు యాంకర్ రష్మి కూడా వీరి బాటలోనే వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధమవుతుందట. బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మి, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తుంటుంది. కానీ వెండితెరపై ఆమెకి సరైన గుర్తింపు మాత్రం రాలేదు. అందుకే డిజిటల్ రంగంలో తన సత్తా చాటాలని అనుకుంటోంది.

'ఎ ఫిలిం బై అరవింద్' చిత్ర దర్శకుడు శేఖర్ సూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ లో రష్మి నటించబోతుంది. ఈ వెబ్ సిరీస్కంటెంట్ ఆమెకి నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇందులో సీనియర్ నటుడు శ్రీకాంత్, సత్యదేవ్ లాంటి నటులు కూడా కనిపించబోతున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తో రష్మిఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి!