భారతదేశంలో.. ఈరోజుని ఎవరూ మర్చిపోలేరని బీజేపీ నేత రాజాసింగ్ అన్నారు.  జమ్మూ కశ్మీర్ పై కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.  జమ్మూ కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి ని తొలగిస్తూ..  ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై పలువురు మద్దతు ప్రకటిస్తుంగా... పలువురు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై రాజా సింగ్ స్పందించారు.

మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ కి ఆర్టికల్ 370ని రద్దు చేశారని రాజాసింగ్ చెప్పారు. ఎన్నికల సమయంలో ఈ అంశాన్ని మేనిఫెస్టోలో ఉంచినట్లు ఆయన చెప్పారు. గత ఎన్నికల సమయంలోనే తాము అధికారంలోకి వస్తే... ఆర్టికల్ 370ని తొలగిస్తామని మోదీ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీని నేడు అమలు చేశారని ఆయన అన్నారు.

ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో ఎవరైనా భూములు కొనుగోలు చేసుకోవచ్చని... ఎలాంటి ఫ్యాక్టరీ అయినా పెట్టుకోవచ్చని చెప్పారు. ఇప్పుడు జమ్మూ కశ్మీర్ లో మన జాతీయ జెండా ఎగురుతుందని చెప్పారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. 

మోదీ తీసుకున్న ఈ నిర్ణయం జమ్మూ కశ్మీర్ లోని యువకులకు  ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ 370 ఆర్టికల్ ఎత్తివేసిన తర్వాత అక్కడ మంచి ఫ్యాక్టరీలు వస్తాయని.. దాంతో యువకులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

వీడియో

"

related news

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్