చరిత్రలోనే తొలిసారిగా అమర్ నాథ్ యాత్ర రద్దుతో మొదలైన హడావుడి, బలగాల మోహరింపుతో ఇంకాస్త ఎక్కువయ్యి కాశ్మీరీ నేతల గృహనిర్బంధంతో ఖచ్చితంగా బిజెపి తన మానిఫెస్టోలో చేర్చిన అంశం - "కాశ్మీర్ కి ప్రత్యేక అధికారాలను కల్పించే 370 రద్దు" ను అమలు చేసి తీరుతుంది అని అర్థమయ్యింది. ఇందాకటి అమిత్ షా ప్రకటన, వెనువెంటనే విడుదలైన గెజిట్ తో ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న స్వయం ప్రతిపత్తిని కాశ్మీర్ కోల్పోయింది. అసలు ఇంత త్వరగా ఎందుకు చేయవలిసి వచ్చింది? దీనికి దారి తీసిన కారణాలేంటి? అంతర్జాతీయంగా భారత్ కు కలిగే లాభాలేంటో చూద్దాం. 

కొన్ని దశాబ్దాలుగా కాశ్మీర్ లో తీవ్రవాద కార్యకలాపాలు పెల్లుబికుతున్న విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని కట్టడి చేయడానికి గతంలో కూడా గట్టిగానే కృషి చేసింది భారత ప్రభుత్వం. 2019 బిజెపి మానిఫెస్టోలో కూడా ఇది చేర్చారు. రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ ఖచ్చితంగా ఈ ఆర్టికల్ 370 రద్దును  అమలుచేసి తీరవలిసిందే. రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా దీనిపైనా ప్రశ్నలు తలెత్తవచ్చు. మరోమారు తమను గెలిపిస్తే 370ని రద్దు చేస్తాము  అని  బిజెపి చెప్పలేదు. 

అంతే కాకుండా, 2019 ఎన్నికల్లో ముఖ్య ప్రచారాస్త్రంగా దీన్ని వాడుకున్నారు. బిజెపి పూర్వపు సంస్థ జనసంఘ్ కూడా కాశ్మీర్ కి ప్రత్యేక అధికారాలు ఉండకూడదు అని తీర్మానించిన విషయం తెలిసిందే. మోడీ, షాల ద్వయం ఎప్పటికప్పుడు  విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలోమనందరినీ ఎలా ఆశ్చర్యపరుస్తుందో  తెలిసిందే. వాజపేయి హయాంలో అణు పరీక్షలను జరిపి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అప్పటి ప్రభుత్వం. దీన్ని ఏ దేశం కూడా కనిపెట్టలేకపోయింది. కానీ బిజెపి మాత్రం ఈ విషయాన్ని అప్పటి తమ మేనిఫెస్టోలో బాహాటంగానే ప్రచురించారు. దీన్నిబట్టి బిజెపి మానిఫెస్టోకు కట్టుబడి ఉంటుంది అన్న విషయం తేటతెల్లం.

అసలు ఈ ఆర్టికల్ 35ఏ నిజంగా కాశ్మీరీ ముస్లిం ల రక్షణ కొరకేనా?

అర్టికల్ 35ఏలో ఉన్న అంశాలు స్వాతంత్రం వచ్చిన తరువాత చేర్చినవి కాదు. ఇవి కాశ్మీరీ ముస్లిమ్స్ రక్షణకోసం ఏర్పాటుచేసినవి అంతకన్నా కాదు. అసలు కాశ్మీర్ లో ముస్లిముల ఒక శక్తిగా 1940ల్లో షేక్ అబ్దుల్లా నాయకత్వంలో మాత్రమే ఎదిగారు. మరి ఈ ఏర్పాటు ఎవరికోసం చేసారు? అప్పటి కాశ్మీరీ మహారాజు హరి సింగ్ కాశ్మీరీ పండిట్ ల రక్షణ కొరకు 1912, 27, 1932ల్లో దాదాపుగా ఇప్పటి 35ఏ లో ఉన్న అంశాలను కొన్ని చట్టాల రూపంలో ఏర్పాటు చేసారు. కాబట్టి ఇది భారత దేశ స్వాతంత్రం వచ్చిన తరువాత ఏర్పాటు చేసినవి కాదు. భారత దేశం ఏర్పడే కన్నా 35 సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నవే. భారత దేశంలో విలీనం అయ్యాక, అప్పటి కాశ్మీరీ నేతలు వీటిని కొనసాగించాలని కోరారు. ఈ హక్కుల కొనసాగింపు వల్ల ఇతర ప్రాంతాల్లో ఉన్న భారతీయులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోయినప్పటికీ, వారికి ఈ హక్కులను కొనసాగించారు. కాబట్టి ఇది ఎంత మాత్రం కూడా ముస్లిముల హక్కులను కాలరాయడం కాదు అనే బిజెపి వాదనకు బలం చేకూరుతోంది. 

తరచుగా బిజెపి నేతలు ఈ ప్రత్యేక అధికారాల వల్ల  వేరే రాష్ట్రానికి చెందిన అబ్బాయిని పెళ్లాడితే మహిళలు తమ ఆస్తి హక్కులను కోల్పోతున్నారు అని చెబుతూనే ఉన్నారు. వీటన్నింటినీ కలిపి చూసుకుంటే బిజెపి ఖచ్చితంగా ఈ సారి చేసితీరుతుంది అని అందరూ ఊహించినట్టే కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసారు. 

మరి ఇప్పుడే ఎందుకు???

త్వరలో కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. ఇంకా ఎక్కువ కాలం ఇలానే ఉంచితే ప్రపంచ దేశాలు సైతం భారతీయ ఎన్నికల వ్యవస్థ పైన విమర్శలు చేసే ఆస్కారాన్ని మనమే కల్పించినవారమవుతాము. అంతే కాకుండా త్వరలోనే ఉన్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలతోపాటు కనుక కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల సంఘానికి కూడా కొద్దిగా భారం తగ్గుతుంది. 

అన్నింటికంటే ముఖ్యంగా, ట్రంప్ తన సైన్యాన్ని ఆఫ్ఘానిస్తాన్ నుంచి వెనక్కి తరలించుకొని అక్కడ ఒక డమ్మీ ప్రభుత్వాన్ని తాలిబాన్ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అక్కడి నుండి వెళ్లాలని భావిస్తున్నాడు. అప్పుడు ఆఫ్ఘానిస్తాన్ లో విజయం సాధించామని చెప్పుకొని వచ్చే సంవత్సరం జరిగే అమెరికా అధ్యక్షా ఎన్నికల్లో గెలవాలని ట్రంప్ ఆశ. తాలిబాన్ లు పాకిస్థాన్ కు చెందిన ఐ ఎస్ ఐ కనుసన్నల్లో నడుస్తారనేది జగమెరిగిన సత్యం. ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడితే, ఇప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తాలిబన్ ఉగ్రవాదులు ఖాలీగా మారుతారు. వారిని అప్పుడు కాశ్మీర్ వైఫు మరల్చి కాశ్మీర్ లో మారణ హోమం సృష్టించాలని పాకిస్తాన్ పన్నాగం పన్నుతోంది. ఆ దాడులను ఏ ఐ ఎస్ ఐ ఎస్ ముసుగులోనో ఆల్ ఖాయిదా ముసుగులోనో చిత్రీకరించి బయట దేశాలకు చూపెట్టి తమకు ఎం సంబంధం లేదు అనే చేతులు దులుపుకునే ప్రమాదం కూడా లేకపోలేదు. 

ఆఫ్ఘనిస్థాన్ లో ఏర్పాటు చేయబోయే డమ్మీ ప్రభుత్వం పాక్ కనుసన్నల్లో నడుస్తుంది.  చైనా పాకిస్థాన్ లో భారీ పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. తమ దేశ ఆర్ధిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి, చైనా ఏర్పాటు కాబోయే డమ్మీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోంది. రష్యా సైతం ఉగ్రవాదం తమ దేశంలోకి పాకకుండా ఉండేందుకు తాలిబన్ లకు అధికారం అప్పగించడానికి వంత పాడుతుంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ ఆఫ్ఘానిస్తాన్ వ్యవహారంలో పాకిస్థాన్ కు వంతపాడుతుంటే, ఆ చర్య వల్ల భారత్ కు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు భారత్ ఎందుకు స్పందించదు? 

ఆఫ్ఘానిస్తాన్ విషయంలో ఇండియా ఏమీ చెయ్యలేకపోవచ్చు. కానీ భారత్ లో అంతర్భాగమైన కాశ్మీర్ లో మారణహోమం జరగబోతుందని తెలిసి భారత్ ఊరికే కూర్చోలేదు కదా? 

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్