Asianet News TeluguAsianet News Telugu

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

 ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ తోపాటు మరికొన్ని పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే... బీజేపీ పేరు చెబితేనే మండిపడే కేజ్రీవాల్ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం గమనార్హం.

In Surprise Tweet, Arvind Kejriwal Backs Centre On Jammu And Kashmir Move
Author
Hyderabad, First Published Aug 5, 2019, 3:43 PM IST

జమ్మూ కశ్మీర్ ని విభజిస్తూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కాగా... ఆయన స్పందించిన తీరుని చూసి అందరూ షాకయ్యారు. ఇంతకీ మ్యాటరేంటంటే... జమ్మూకశ్మీర్ కి ఉన్న స్వయంప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం నేడు రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ ని రెండు భాగాలుగా విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. 

కాగా... ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ తోపాటు మరికొన్ని పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే... బీజేపీ పేరు చెబితేనే మండిపడే కేజ్రీవాల్ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం గమనార్హం.

బీజేపీకి వ్యతిరేంగా పోరాడుతూ.. ఢిల్లీలో అధికారం చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ తొలసారిగా ఆ పార్టీకి మద్దతు  పలికారు. జమ్మూ కశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని.. అభివృద్ధి కూడా జరుగుతుందని తాము భావిస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా... కేజ్రీవాల్ ఇంత పాజిటివ్ గా ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

related news

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

Follow Us:
Download App:
  • android
  • ios