బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో షోలు చేసిన శ్యామల.. గతేడాది బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టంట్ గా పాల్గొంది. టీవీ షోలతో పాటు 'లౌక్యం', 'ఒక లైలా కోసం' వంటి చిత్రాల్లో కూడా నటించింది. హోమ్లీ కనిపించే శ్యామలకి ఫ్యామిలీ ఆడియన్స్ లో చాలా మంది అభిమానులు ఉన్నారు. ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈ మధ్య ఫోటోషూట్ లలో పాల్గొంటూ, హాట్ ఫోజిలిస్తూ షాకిస్తోంది. తాజాగా ఈమె 'మన్మథుడు 2' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో యాంకరింగ్ చేసింది. ఈవెంట్ కోసం అమ్మడు చాలా అందంగా రెడీ అయి వచ్చింది. లైట్ పింక్ కలర్ డిజైనర్ వేర్ ఫ్రాక్ ధరించింది. ఈ గౌను ఆమె క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది.

శ్యామల ఆ విధంగా చూసిన వారు ఒక్కసారిగా షాకయ్యారు. అందరి దృష్టి తనపై పడడానికే ఆమె ఈ రేంజ్ లో గ్లామర్షో చేసి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యాంకర్లు అందరూ కూడా గ్లామర్ షోకి మొహమాట పడడం లేదు. వారికి టీవీ షోలలో కానీ సినిమాల్లో కానీ మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ కారణంగానే శ్యామల కూడా గ్లామర్ షో చేస్తుందని టాక్.

తనలోని కూడా గ్లామర్ యాంగిల్ ఉందని ఫోటోల ద్వారా చెప్పకనే చెబుతోంది. ఈవెంట్ ఫోటోలు శ్యామల సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి చూసిన నెటిజన్లు కొందరు ఆమెని హాట్ గా ఉన్నావని కామెంట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఇలాంటి బట్టలు వేసుకోవడానికి సిగ్గులేదా అంటూ ఫైర్ అవుతున్నారు.