శ్రీనగర్:జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలనపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. మెహబూబాబా ముఫ్తీ పాలన కంటే గవర్నర్ పాలన బాగుందని కితాబిచ్చారు. మరో వైపు కాశ్మీర్ లో యువతకు ఉపాధి కోసం మోడీ సర్కార్ అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయంపై ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక స్థితి గతులపై ఆసియా నెట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేను యధాతథంగా ఉంచుతున్నాం.జమ్మూలోని 10 జిల్లాల్లో 5,35,0811 మంది జనాభా ఉంది. అయితే ఐదు జిల్లాల్లోని ప్రజల నుండి అబిప్రాయాలను సేకరించాం. కాశ్మీర్ ప్రాంతంలోని 10 జిల్లాల్లో ఐదు  జిల్లాలు, లడఖ్‌లోని రెండు జిల్లాల ప్రజల అభిప్రాయాలను సేకరించాం.

టెర్రరిజం, సోషల్ ఆన్ రెస్ట్, ప్రభుత్వంలో అవినీతి, ఉపాధి అవకాశాలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ విషయాలనే ప్రజలు  ప్రధానంగా ప్రస్తావించారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని 54 శాతం  మంది ఈ విషయాలను ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  కాశ్మీర్ లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్టుగా ప్రజలు అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పన కోసం  మోడీ సర్కార్ అన్ని రకాల ప్రయత్నాలను చేసిందని ప్రజలు అభిప్రాయపడ్డారు. మోడీ సర్కార్ కాశ్మీర్ యువత కోసం పనిచేస్తున్న విషయాన్ని 39 శాతం మంది ప్రజలు అంగీకరించారు.51 శాతం మంది మాత్రం ఈ విషయాన్ని అంగీకరించలేదు. 10 శాతం ప్రజలు మాత్రం ఈ విషయం తమకు తెలియదని  తేల్చి చెప్పారు.

ఇక రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలు మోడీ ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించనుందని 48 శాతం ప్రజలు ఒప్పుకొన్నారు. 39 శాతం ప్రజలు మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. 13 శాతం ప్రజలు తమకు ఈ విషయం తెలియదన్నారు.ఇక గ్రామీణ ప్రాంతాల్లోని 36  శాతం ప్రజలు మోడీ సర్కార్ యువతకు ఉపాధి కల్పించనున్న విషయాన్ని అంగీకరించింది.55 శాతం మంది మాత్రం ఈ విషయమై విభేదించారు.9 శాతం ప్రజలు ఈ విషయమై తమకు తెలియదన్నారు. 

ఇక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి  విద్వేషపూరితమైన ఘటనలు చోటు చేసుకోకుండా మోడీ ప్రభుత్వం చేస్తోందని సుమారు 36 శాతం ప్రజలు అంగీకరించారు. 49 శాతం ప్రజలు మాత్రం ఈ నిర్ణయంతో విబేధించారు. మరో 15 శాతం ప్రజలు మాత్రం ఈ విషయంలో  తమకు ఏమీ తెలియదని చెప్పారు.

ఇదే విషయమై పట్టణ ప్రాంతాల ప్రజలు మోడీ సర్కార్ ఎలాంటి విధ్వంసం లేకుండా ఎన్నికలు జరిగేలా చూస్తారని 49 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు. 35 శాతం ప్రజలు మాత్రం ఈ విషయంతో విబేధించారు. 15 శాతం మాత్రం ఈ విషయం తమకు తెలియదన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం ఈ విషయంలో మోడీకి 30 శాతం మందే ఓటు చేశారు. 55 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. 14 శాతం మంది ఈ విషయంలో  తాము ఏమీ చెప్పలేమని ప్రకటించారు.

కాశ్మీర్‌లో శాంతిని ప్రేమించే ప్రజలు ఇక ఏ మాత్రం భయపడరనే విషయాన్ని 45 శాతం మంది ఒప్పుకొన్నారు. ఈ విషయాన్ని 40 శాతం మంది వ్యతిరేకించారు. 15 శాతం మంది ఈ విషయంలో ఏ అభిప్రాయాన్ని కూడ స్పష్టం చేయలేదు.

ఇక పట్టణ ప్రాంతాలకు చెందిన వారిలో 59 శాతం మంది శాంతిని కోరుకొనే  కాశ్మీర్ ప్రజలు ఏ మాత్రం భయపడరని స్పష్టం చేశారు. 32శాతం మాత్రం ఈ విషయమై విభేదించారు. 9శాతం మాత్రం తమకు ఏం తెలియదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40 శాతం మంది ఈ విషయమై తమ మద్దతు పలికితే 43 శాతం మంది ఈ విషయంలో వ్యతిరేకతను తెలిపారు. 18 శాతం మంది మాత్రం తమకు ఏమీ తెలియదని చెప్పారు.

జమ్మూకాశ్మీర్ ను విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం తిప్పికొడుతుందని 37 శాతం అబిప్రాయపడ్డారు. 46 శాతం మంది ఈ విషయాన్ని వ్యతిరేకించారు. 17 శాతం మంది మాత్రం ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదు.

ఇదే విషయంలో  పట్టణ ప్రాంతంలో  51 శాతం మంది మోడీ సర్కార్ కు మద్దతుగా నిలిస్తే 39 శాతం మంది వ్యతిరేకించారు. 10 శాతం మంది మాత్రమే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.ఇక గ్రామీణ ప్రాంతాల్లో  32 శాతం ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిస్తే 48 మంది మాత్రం వ్యతిరేకించారు. 20 శాతం మంది మాత్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు.

మోడీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన  విషయాన్ని పలువురు ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన విషయమై తమకు తెలుసునని 68 శాతం ప్రజలు స్పష్టం చేశారు. ఉపాధి కల్పన కోసం రాష్ట్రంలో తీసుకొన్న చర్యలపై తమకు అవగాహన ఉందని 66 శాతం ప్రజలు అంగీకరించారు. 

వృద్దులు ఇతరుల కోసం రిలీఫ్ పనుల కోసం చేసిన పనుల విషయం తమకు తెలుసునని 64 శాతం ప్రజలు  అంగీకరించారు.జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో విద్య విషయంలో తీసుకొన్న నిర్ణయాలపై 68 శాతం ప్రజలు తమకు తెలుసునని ప్రకటించారు. మోడీ సర్కార్ తీసుకొన్న ఇతర కార్యక్రమాల గురించి కూడ తమకు తెలుసునని 65 శాతం ప్రజలు ప్రకటించారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గవర్నర్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 శాతం ప్రజలు గవర్నర్ పాలనపై సంతృప్తిగా ఉన్నారు. 

25 శాతం ప్రజలు మాత్రం గవర్నర్ పాలనపై కొంత సంతృప్తిని వ్యక్తం చేశారు. 21 శాతం ప్రజలు మాత్రం గవర్నర్ పాలనపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. 22 శాతం మాత్రం గవర్నర్ పాలనపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. 11 శాతం మంది మాత్రం ఏం చెప్పలేదు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మెహబూబాబా ముఫ్తీ పాలన కంటే గవర్నర్ పాలన మేలు అని ప్రజలు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని 42 శాతం ప్రజలు మెహబూబా ముఫ్తీ పాలన కంటే గవర్నర్ పాలనకే ఓటు చేశారు.19 శాతం మంది మాత్రం ముఫ్తీ ప్రభుత్వం కంటే గవర్నర్ పాలన ఘోరంగా ఉందని అభిప్రాయపడ్డారు.19 శాతం ప్రజలు గవర్నర్ పాలనను ముఫ్తీ పాలన ఒక్కటేననే అభిప్రాయంతో ఉన్నారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ కమిట్ మెంట్‌పై 21 శాతం ప్రజలు సంతోషంగా ఉన్నారు. 20 శాతం ప్రజలు కొంత మేరకు సంతోషంతో ఉన్నట్టుగా ప్రకటించారు. 8 శాతం ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేశారు. 17 శాతం ప్రజలు కొంత మేర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 15 శాతం మంది పూర్తిస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. 7 శాతం మంది ఏ విషయాన్ని స్పష్టం చేయలేదు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 47 శాతం ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు.నేషనల్ కాన్పరెన్స్ వైపు 24 శాతం, పీడీపీ వైపు 19 శాతం, కాంగ్రెస్ వైపు 10 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు.

నేషనల్ కాన్పరెన్స్, పీడీపీల్లో ఎక్కువగా నేషనల్ కాన్పరెన్స్ వైపు ప్రజలు మొగ్గు చూపారు. నేషనల్ కాన్పరెన్స్ వైపు36 శాతం మంది, పీడీపీ వైపు 23 శాతం మంది మొగ్గు చూపారు ఈ రెండు పార్టీల వైపు 13 శాతం మంది మొగ్గు చూపారు. 8 శాతం మంది మాత్రమే  ఈ విషయమై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

దేశంలో బీజేపీ పాలన ఉంటే మేలని 40 శాతం ప్రజలు అభిప్రాయపడ్డారు.23 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు.ఇక కాశ్మీర్ రాష్ట్రానికి ఎవరు మంచి నాయకుడని ప్రశ్నిస్తే ఫరూక్ అబ్దుల్లా వైపే ప్రజలు మొగ్గు చూపారు.27 శాతం ప్రజలు ఫరూక్ అబ్దుల్లాకు ఓటు చేశారు. ఫరూక్ అబ్దుల్లా తనయుడు ఓమర్ అబ్దుల్లాకు 26 శాతం, మెహబూబా ముఫ్తీకి 22 శాతం, నరేంద్ర మోడీకి 19 శాతం ప్రజలు ఓటు చేశారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో టెర్రరిజం పెరిగిపోవడానికి ప్రత్యేక వాదులు (వేర్పాటువాదులు) కారణమని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.39 శాతం ప్రజలు ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. పాకిస్తాన్ పై 12 శాతం మొగ్గు చూపారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన పలు పార్టీలకు చెందిన నేతల పిల్లలు విదేశాల్లో చదువుకోవడం, అక్కడే ఉండడంపై మాత్రం ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని తేలింది.