న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యసభ శాసన సభాపక్ష నేత గులాం నబీ ఆజాద్ సంచనల వ్యాఖ్యలు చేశారు. సంఖ్యాబలం ఉందని కేంద్రంలోని బీజేపీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. కశ్మీర్ విభజన తాను కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చారు. 

హోంమంత్రి అమిత్ షా జమ్ము కశ్మీర్ పై అణుబాంబు వేశారంటూ మండిపడ్డారు. పారామిలటరీ బలగాలను పెద్ద ఎత్తున పంపారని విమర్శించారు. అమర్ నాథ్ యాత్రికులను సైతం భయపెట్టి వెనక్కి పంపారంటూ విరుచుకుపడ్డారు. 

అందర్నీ వెనక్కి పంపి హడావిడిగా నిర్ణయాలు తీసుకున్నారంటూ విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుందంటూ మండిపడ్డారు.తాము ఎట్టి పరిస్థితుల్లో ఓటు బ్యాంకు రాజకీయాలను సహించేది లేదని చెప్పుకొచ్చారు. 

జమ్ము కశ్మీర్ ప్రజలకు భారత్ పై ఎంతో గౌరవం ఉందని అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వారి నమ్మకానికి గండికొట్టినట్లైందన్నారు. కేంద్రంలోని బీజేపీ తీసుకున్నటు వంటి నిర్ణయం వల్ల జమ్ము కశ్మీర్ లో సంక్షోభం తెచ్చేలా ఉందని గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్