డైలాగులు చెప్పటంలో  బాలయ్య  ఓ విభిన్నమైన స్టైల్. తన డైలాగులతో ఇట్టే మెస్మరైజ్ చేసే ఆయన ఇప్పుడు డైలాగులతో నడిచే కోర్ట్ డ్రామాతో రెడీ అవుతున్నారు.  పూర్తి స్థాయి లాయర్ క్యారెక్టర్ లో ఆయన కనపడి అదరకొట్టబోతున్నారు.  రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల మాదిరి కాకుండా బాలయ్య  విభిన్న తరహా చిత్రానికి తెర తీస్తున్నారు.

ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. హిందీ లో హిట్ అయిన పింక్ సినిమా ఆధారంగా తమిళంలో  రెడీ అయిన నెర్కొండ పర్వాయ్ సినిమా ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా చేసిన ఈ చిత్రానికి అక్కడ మంచి క్రేజ్ వచ్చింది.  ఇంకా రిలీజ్ కానీ ఈ సినిమా మీద అక్కడ మంచి ఎక్సపెక్టేషన్స్  వున్నాయి. 

ఈ నేపధ్యంలో నాలుగు  రోజుల క్రితం ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు వెళ్లి  స్పెషల్ షో చూసి వచ్చారు. బాలకృష్ణ ఓకె అంటే ఈ సినిమాను తెలుగులో చేయాలన్నది దిల్ రాజు  ఆలోచన. తమిళ సినిమా దిల్ రాజుకు బాగా నచ్చింది.  బాలయ్య కూడా ఈ సినిమాని చూసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. ఇక ఈ సినిమాకు  దిల్ రాజు ఓ  టైటిల్ కూడా అనుకున్నారు. ‘లాయర్ సాబ్’ అన్న  టైటిల్ తో ఈ సినిమాని తెలుగులో తెరకెక్కిస్తే పెద్ద హిట్ అవుతుందని ఆయన అంచనా. 

ఇక తెలుగు పింక్ అయిన లాయర్ సాబ్ కు దిల్ రాజు నిర్మాణ  పార్టనర్ మరెవరో  కాదు. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్. ప్రస్తుతం ఆయనే ఎఫ్ 2 సినిమాకు బాలీవుడ్ లో దిల్ రాజకు నిర్మాణ భాగస్వామిగా వున్నారు. దాంతో ఈ  పార్టనర్ షిప్ ని  తెలుగులోకి కూడా విస్తరించనున్నారు ‘లాయర్ సాబ్’ సినిమా ద్వారా.  ఇక మిగతాదంతా బాలయ్య చేతిలో ఉంది.