అక్కినేని నాగార్జునకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సంబంధాలు సరిగ్గా లేవా..? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దానికి కారణమేంటంటే.. నిన్న జరిగిన 'మన్మథుడు 2' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాగార్జున మాట్లాడిన మాటలే.. 'మన్మథుడు' సినిమాకి 'మన్మథుడు 2' సినిమాకి కథా పరంగా ఎలాంటి సంబంధం లేకపోయినా.. తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిన 'మన్మథుడు' సినిమాకు తమతో కలిసి పని చేసిన టెక్నీషియన్లను 'మన్మథుడు 2' సినిమా ఈవెంట్ కి పిలిచాడు నాగార్జున.

అయితే 'మన్మథుడు 2' సినిమా సక్సెస్ లో కీలకపాత్ర పోషించిన త్రివిక్రమ్ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు. 'మన్మథుడు' సినిమాకి కథ, మాటలు అందించింది త్రివిక్రమ్. ఆయన రాసిన పంచ్ లు, ప్రాసల కారణంగా సినిమాకి మరింత హైప్ వచ్చింది. అయితే నాగ్ మాత్రం త్రివిక్రమ్ ని పక్కన పెట్టి దర్శకుడు విజయ్ భాస్కర్ ని ఆకాశానికి ఎత్తేశాడు. 'మన్మథుడు' సృష్టికర్త విజయ్ భాస్కర్ అని నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు.

అందులో పంచ్ లన్నీ కూడా ఆయన ఘనతేనని పర్టిక్యులర్ గా చెప్పడం విశేషం. నిజజీవితంలో విజయ్ భాస్కర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. నాగార్జున స్పీచ్ మొత్తం వింటే మాత్రం 'మన్మథుడు' సినిమాలో త్రివిక్రమ్ గొప్పేమీ లేదన్నట్లుగా మాట్లాడారు. 'మన్మథుడు' సినిమా టీంని 'మన్మథుడు 2' ప్రీరిలీజ్ ఈవెంట్ కి పిలవాలనుకున్నప్పుడుత్రివిక్రమ్ ను నాగార్జున ఆహ్వానించారా లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

ఒకవేళ త్రివిక్రమ్ రాలేని పరిస్థితుల్లో ఉన్న ఆ సంగతి నాగ్ స్టేజ్ మీదే చెప్పేవారు. కానీ త్రివిక్రమ్ పేరు ఎక్కడా ఎత్తకపోవడం, 'మన్మథుడు' క్రెడిట్ మొత్తం విజయ్ భాస్కర్ దే అని చెప్పడంతో త్రివిక్రమ్ కి నాగ్ కి మధ్య చెడిందనే సందేహాలు కలుగుతున్నాయి. తన కొడుకులతో త్రివిక్రమ్ సినిమాలు చేయాలని నాగ్ చూశాడని కానీ త్రివిక్రమ్ ఇంటరెస్ట్  చూపించకపోవడంతో  ఆ కోపంతోనే నాగ్ ఇలా ప్రవర్తించి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.