Asianet News TeluguAsianet News Telugu

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్ఆర్ సీపీ మద్దతు ప్రకటించింది. ఈ ఆర్టికల్ ను రద్దు చేయడాన్ని ఆ పార్టీ స్వాగతించింది. రాజ్యసభలో ఈ మేరకు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. 

ysrcp supports to article 370 scrapping
Author
New Delhi, First Published Aug 5, 2019, 1:52 PM IST

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాజ్యసభలో ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. కాశ్మీర్ లో ఈ పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆయన ఆరోపించారు.

సోమవారం నాడు ఆర్టికల్ 370 రద్దుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి ప్రసంగించారు.  ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఎలా ఉంటాయని ఆయన ప్రశ్నించారు. రెండు జాతీయ పతాకాలు ఉండడంపై కూడ ఆయన మాట్లాడారు.

భారత జాతీయ పతాకాన్ని దగ్దం చేయడం  జమ్మూలో నేరం ఎందుకు కాదని ఆయన ప్రశ్నించారు. ఒకే దేశంలో ఇద్దరు ప్రధానులు ఉంటారా ఇది ఎక్కడ ఉండదన్నారు. 1947 నుండి  జమ్మూకాశ్మీర్ ప్రజలు ఈ విషయమై పోరాటం చేస్తున్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.

370 ఆర్టికల్ రద్దు చేసి కేంద్రం మంచి నిర్ణయం తీసుకొందని  విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందని విజయసాయిరెడ్డి ప్రకటించారు

కాశ్మీర్ సమస్యకు మోడీ సర్కార్ మంచి పరిష్కారాన్ని చూపారని  ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ, అమిత్ షాలు చరిత్రలో నిలిచిపోతారని విజయసాయిరెడ్డి ప్రకటించారు.  370 ఆర్టికల్ రద్దు చేయాలని  నిర్ణయం తీసుకొన్న మోడీకి  విజయసాయి రెడ్డి హ్యాట్సాప్ చెప్పారు.

సంబంధిత వార్తలు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

Follow Us:
Download App:
  • android
  • ios