రాజమౌళి ప్లాన్ చేసుకున్న భారీ మల్టి స్టారర్ RRRపై రోజుకో వార్త అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు సినిమా విడుదలయ్యాక ఏ స్థాయిలో రికార్డులు బద్దలుకొడుతుందో అనే ఆలోచనల కన్నా అసలు సినిమాలో తారక్ - చరణ్ ల పాత్రలు ఏ విధంగా ఉంటాయి? అనే సందేహమే చర్చనీయాంశంగా మారింది. 

ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు సంబందించిన రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కొంచెం నెగిటివ్ గానే ఉంటుందని టాక్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని లేటెస్ట్ గా అందిన అప్డేట్ ప్రకారం ఆయన ఫిట్ నెస్ కు సంబందించి జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దంగల్ సినిమాలో మాదిరిగా అమిర్ ఖాన్ కండలు పెంచినట్లు స్ట్రాంగ్ గా కనిపిస్తాడట తారక్. 

ఇప్పటికే గడ్డంతో కొంచెం లావుగా కనిపిస్తున్న ఎన్టీఆర్ సినిమాలో బలశాలిగా చాలా కఠినంగా కనిపిస్తాడని తెలుస్తోంది. సాధారణంగా జక్కన్న సినిమాల్లో విలన్స్ చాలా వైలెంట్ గా ఉంటారు. అయితేఎక్కువ  చేడుగా చూపించకుండా ఎన్టీఆర్ పాత్రను అంతకంటే హై లెవెల్లో చూపిస్తారట. అతని పాత్రను డిజైన్ చేసిన తీరు ఎవరు ఊహించని విధంగా ఉంటుందని టాక్. నటించడానికే చాలా కఠినంగా ఉంటుందట. 

అందుకే జక్కన్న తారక్ తో ఇన్ని రోజులు స్పెషల్ గా వర్క్ షాప్ లో పాల్గొని తనకు నచ్చినట్టుగా మలుచుకున్నాడు. ఇక చరణ్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ఉన్న ఫిట్ నెస్ తోనే నటిస్తాడట. ఈ నెల 19న మొదటి షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు. ఇప్పటికే సన్నివేశాల కోసం సెట్స్ ని కూడా నిర్మించారు. ఈ షెడ్యూల్ తరువాత హీరోయిన్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి..

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు