MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

మార్చి 19న విడుదల కావాల్సిన యష్‌ `టాక్సిక్‌` వాయిదా పడింది. ఇప్పుడు `ధురంధర్‌ 2` కూడా వాయిదా పడబోతుందట. దీంతో పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` అదే డేట్‌ కి రాబోతుందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 04 2026, 10:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వర్సెస్‌ ధురంధర్‌ 2
Image Credit : Asianet News

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ వర్సెస్‌ ధురంధర్‌ 2

ప్రస్తుతం సినిమాలకు సంబంధించి చాలా మార్పులు జరుగుతున్నాయి. మార్చిలో బిగ్‌ క్లాష్‌ క్యాన్సిల్‌ అయ్యింది. `టాక్సిక్‌`, `ధురంధర్‌ 2` మధ్య పెద్ద పోటీ నెలకొంది. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈ పోటీ నుంచి `టాక్సిక్‌` తప్పుకుంది. మార్చి 19న విడుదల కావాల్సిన ఈ మూవీని వాయిదా వేశారు. జూన్‌ 4న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో `ధురంధర్‌ 2`కి ఇక తిరుగులేదని చెప్పొచ్చు. అసలే ఈ సినిమాకి భారీ హైప్‌ ఉంది. `ధురంధర్‌` మూవీ సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు రెండో పార్ట్ 2పై మంచి అంచనాలున్నాయి. మరోవైపు అదే డేట్‌ కి `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` రాబోతుందట. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`ధురంధర్‌ 2` కూడా వాయిదా?
Image Credit : X/@yash/@ranveersingh

`ధురంధర్‌ 2` కూడా వాయిదా?

ఈ క్రమంలో ఇప్పుడు `ధురంధర్‌ 2`కి సంబంధించిన ఆసక్తికర వార్త వినిపిస్తోంది. మార్చి 19నే రిలీజ్‌ కావాల్సిన ఈ సినిమా కూడా వాయిదా పడబోతుందట. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది. ప్రస్తుతం మిడిల్‌ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది. ఇరాన్‌, ఇజ్రాయిల్‌, దుబాయ్‌ వంటి కంట్రీస్‌ మధ్య యుద్ధం జరుగుతుంది. దీంతో అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. దీని కారణంగానే `టాక్సిక్‌` మూవీని వాయిదా వేశారు. ఈ సమయంలో సినిమాని రిలీజ్‌ చేస్తే అక్కడ గట్టి దెబ్బ పడుతుందని, వసూళ్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని యష్‌ సినిమాని వాయిదా వేశారు.

35
`టాక్సిక్‌` బాటలోనే `ధురంధర్‌ 2`?
Image Credit : Asianet News

`టాక్సిక్‌` బాటలోనే `ధురంధర్‌ 2`?

ఇప్పుడు అదే బాటలో `ధురంధర్‌ 2`ని కూడా వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్ర బృందం దీనిపై చర్చలు జరుపుతుందట. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సినిమాని విడుదల చేయడం సరైనది కాదని టీమ్‌ భావిస్తుందట. అందుకే రిలీజ్‌ విషయంలో రివ్యూ చేస్తుందని సమాచారం. రేపు గురువారం `ధురంధర్‌ 2` ట్రైలర్‌ని విడుదల చేయాలనుకున్నారు. దీనితో రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ రానుంది. కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఈ చిత్రం వాయిదా పడుతుందని టాక్‌. ఇందులో నిజమెంతా అనేది త్వరలోనే క్లారిటీ రానుంది.

45
మార్చి 19న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Image Credit : Asianet News

మార్చి 19న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

ఇదిలా ఉంటే ఇప్పుడు మార్చి 19పై పవన్‌ కళ్యాణ్‌ కన్నేసినట్టు సమాచారం. `టాక్సిక్‌` వాయిదా పడింది. ఇప్పుడు `ధురంధర్‌ 2` కూడా వాయిదా పడితే ఆ డేట్‌ని లాక్‌ చేయాలని పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` టీమ్‌ ప్రయత్నిస్తుంది. అయితే మార్చి 26న ఈ మూవీని విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి రీ రికార్డింగ్‌ వర్క్ జరుగుతుందని, తమన్‌ బీజీఎం అందిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు. అయితే బీజీఎం ఆయనతో కాకుండా థమన్‌తో చేయిస్తున్నారట. తాజాగా ఇదే విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్లు భాగమయ్యారని తెలిపారు.

55
ధురంధర్‌ 2తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఢీ
Image Credit : X/@MythriOfficial

ధురంధర్‌ 2తో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఢీ

మార్చి 26న విడుదల కావాల్సిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ని ఇప్పుడు `మార్చి 19`కి ప్లాన్‌ చేస్తున్నారు. `టాక్సిక్‌`, `ధురంధర్‌ 2` వాయిదా పడితే దీన్ని ఈ డేట్‌కి తీసుకురావాలనుకుంటున్నారట. అయితే `ధురంధర్‌ 2` పోస్ట్ పోన్‌ అయినా, కాకపోయినా `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`ని మార్చి 19కి విడుదల చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంలో శ్రీలీలా, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image3
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Related Stories
Recommended image1
Toxic Postponed: టాక్సిక్ రిలీజ్ వాయిదా, కొత్త డేట్ ఇదే.. బాక్సాఫీసు వద్ద `దురందర్‌ 2` ఊచకోత
Recommended image2
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved