దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా షూటింగ్ మేజర్ షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరగనుంది. భారీ బడ్జెట్ తో అక్కడ సెట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. 

షూటింగ్ స్పాట్ కి ఐదు నిమిషాల్లో చేరుకునే విధంగా అక్కడే రాజమౌళి ఆఫీస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆఫీస్ అంటే ఏదో రెండు రూమ్ లు వేసేసి చేయి దులుపుకుంటారనుకుంటే పొరపాటే.. ఎంతో లావిష్ గా రాజమౌళి ఆఫెస్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. పాతకాలపు పద్దతిలో చాలా ట్రెడిషనల్ గా ఆఫీస్ ఉంటుందట. సినిమాకి సంబంధించిన విషయాలను చర్చించుకోవడానికి భారీ స్పేస్ లో ఓ ఏరియాని ఏర్పాటు చేసుకున్నారట. 

అలానే రాజమౌళి కోసం స్పెషల్ రూమ్ తో పాటు సినిమాలో లీడ్ క్యారెక్టర్లు పోషించే నటీనటులందరికీ ఈ ఆఫీస్ లో ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ కోసం స్పెషల్ రూమ్ ఉంటుందట. రాజమౌళి లీడ్ క్యారెక్టర్స్ కి శిక్షణ ఇవ్వడం కోసం విశాలంగా ఉండే గదిని, కాస్ట్ అండ్ క్రూ అందరూ కలిసి భోజనం చేసే విధంగా పెద్ద డైనింగ్ హాల్ కూడా ఉంటుందని తెలుస్తోంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ మిగిలిన క్రాఫ్ట్స్ కోసం మరో రూమ్ ని కేటాయించారు.

ఇటీవల బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ ఈ ఆఫీస్ చూడడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2020లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ ఉంది!

ఇవి కూడా చదవండి..

RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!

'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!

ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?

RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!

RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?

‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ

RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!

RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!

RRR లాంచ్: మొదటి అడుగు పడింది!

'RRR' అసలు టైటిల్ ఏంటంటే..?

'RRR'లో ప్రభాస్ హ్యాండ్!

RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!

చరణ్ కోసం రాజమౌళి ఫోటోషూట్!

#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!

#RRR:ఆ ఒక్క సీన్ కోసం 45 రోజుల షూటింగ్!

రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?

చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!

#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?

RRRలకు రెమ్యూనరేషన్ లేదు..నిర్మాత హ్యాపీ!

RRR: 100కోట్ల డీల్ సెట్టయ్యిందా?

#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!

మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్

షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?

రాజమౌళి ఛాన్స్ ఇచ్చాడా?

#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట

రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..

ఇక నుంచి జూనియర్ కాదు