బీజేపీ ఆటలు సాగవన్నకేటీఆర్: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 19, 2019, 5:42 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.
 

జగన్ కాళ్లైనాపట్టుకుంటా, మీ నిందలు సరికావు: టాలీవుడ్ ను వదలని పృథ్వీ

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి తీరుతామని తెలియజేశారు. భక్తి ఛానల్‌ అక్రమాల మీద చాలా ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటినీ నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు.  

 

151 సీట్లు ఇచ్చింది అందుకేనా....: వైసీపీపై పవన్ ఆగ్రహం

కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే వారిని పట్టించుకోకుండా రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. బాధితులకు సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమన్నారు. 
 

నకిలీ పత్రాలతో రూ.370 కోట్లు మోసం, భీమవరం ప్రముఖుల ప్రమేయం

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రుణాల విషయంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో కొందరు వ్యక్తులు ప్రైవేట్ బ్యాంకులకు సుమారు రూ. 370 కోట్లు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో పట్టణానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు కథనాలు ప్రసారమవుతున్నాయి.

 

జనసేన పార్టీ ఓ విషపు చుక్క, రామ్ చరణ్ కు అభినందనలు : శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మరోవైపు మెగాపవర్ స్టార్, హీరో రామ్ చరణ్ తేజ్ కు అభినందనలు తెలిపారు శ్రీరెడ్డి. సాక్షి అవార్డుల ప్రదానోత్సవంలో రామ్ చరణ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్న శ్రీరెడ్డి, తన అభినందనలు తెలిపారు. 

 

సీఎం జగన్ ఇంటి ముందు ఆత్మహత్య చేసుకుంటా: బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు. అందులో భాగంగానే డ్రోన్లు వినియోగించారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి‌ వచ్చిన తర్వాత చంద్రబాబుకు భద్రత తగ్గించారని చెప్పుకొచ్చారు. 
 

బాబుకు ఆది షాక్: జేపీ నడ్డాతో భేటీ, బీజేపీలోకి?

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ సడ్డాతో సోమవారం నాడు ఆదిానారాయణరెడ్డి సమావేశమయ్యారు.

 

కుట్రలేదు, రాజకీయం వద్దు: డ్రోన్ వివాదంపై డీజీపీ

మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు, వీడియోలు తీయడంపై డీజీపీ సవాంగ్ స్పందించారు. 

 

వివి వినాయక్ జోస్యం.. 'సాహో' తొలిరోజు వసూళ్లు ఎంతంటే!

ఆదివారం రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య రామోజీ ఫిలిం సిటీలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఈవెంట్ కు రాజమౌళి, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దిల్ రాజు, వివి వినాయక్ ఇలా టాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. 

 

రోజూ అడ్డం చూసుకొని ఏడుస్తున్నా.. 'జబర్దస్త్' వినోదిని కామెంట్స్!

'జబర్దస్త్' కామెడీ షోలో లేడీ గెటప్స్ లో కనిపిస్తూ వినోద్ మంచి మార్కులు కొట్టేశాడు. నిజంగానే లేడీనేమో అనుకునేలా ఆయన నటిస్తూ ఆకట్టుకుంటుంటాడు. 

 

చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్... గవర్నర్ కి టీడీపీ నేతల ఫిర్యాదు

గవర్నర్ ని కలిసిన వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామారావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సహా 15మంది సభ్యుల బృందం  ఉన్నారు. అంతక ముందు కృష్ణా నది వరద ఉధృతికి ముంపు బారిన పడిన ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారితో వారు చర్చించారు. 

 

చంద్రబాబు ఇంటిపై డ్రోన్ రచ్చ: కోర్టుకు టీడీపీ నేతలు

చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాతో రికార్డు చేయడంపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. 

 

చంద్రబాబు హత్యకు కుట్ర ఏంటి..? ఎప్పుడో హత్య చేసి 23 అడుగుల గొయ్యిలో పాతేస్తే

 ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్లు అడ్డంగా పెట్టాలని లోకజ్ఞానం లేని లోకేష్ ట్విట్లు చేస్తున్నాడని రమేష్‌ సెటైర్లు వేశారు. చంద్రబాబు కనీసం వారానికొకసారైనా లోకేష్‌కు రాజకీయ జ్ఞానం నేర్పాలని ఎమ్మెల్యే జోగి రమేష్‌ సూచించారు. 

 

అన్నా క్యాంటీన్ల మూసివేత... ఇక ఏపీలో వైఎస్ఆర్ క్యాంటీన్లు

అన్నా క్యాంటీన్ల మూసివేసిన తర్వాత దాని స్థానంలో వైఎస్ఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి వీటిని ప్రారంభించనున్నారు. ఈ క్యాంటీన్లకు భోజనం సరఫరా చేసే అక్షయ పాత్ర ప్రతినిధులకు ఈ మేరకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది.

 

బిగ్ బాస్ 3: నామినేషన్ రచ్చ షురూ.. శ్రీముఖికి పంచ్!

బిగ్ బాస్ సీజన్‌కి ఐదో వారానికి చేరుకోవడంతో సోమవారం నాటి నామినేషన్ ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఐదో వారం ఎలిమినేషన్స్‌కి సంబంధించి కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్స్ చిచ్చు పెట్టారు బిగ్ బాస్. దీంతో ఒకరిపై ఒకరు ఫైర్ అవుతూ నామినేట్ చేస్తున్నారు.
 

ఇండియన్ 2: శంకర్ కీ పాయింట్ ఏమిటంటే?

దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ అలాగే నటనలో లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ 2. అతి కష్టం మీద మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ తో బిజీ అయినా శంకర్ సినిమాలో ఎక్కువగా ఒక సోషల్ పాయింట్ పై ఫోకస్ చేశాడట. 

 

బీజేపీలోకి టీఆర్ఎస్ నేత.... కిషన్ రెడ్డితో మంతనాలు

2014లో కార్పొరేటర్ సీటు కావాలని అప్పటి డిప్యుటీ స్పీకర్ పద్మారావును కోరగా కుదర్లేదు. ఈ సారి మళ్లీ అడ్డగుట్ట కార్పొరేటర్ గా ఉన్న విజయ కుమారికి రెండో సారి కూడా అవకాశం ఇస్తున్నట్లు డివిజన్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో.. ఇక లాభం లేదని భావించిన ఆ నేత... టీఆర్ఎస్ నేత పద్మారావు కార్యక్రమాలకు హాజరౌతూనే బీజేపీలో కి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.

 

రాజకీయాల్లో అవుట్ డేటెడ్.. కేసీఆర్ పై బాబు మోహన్ విమర్శలు

తాము చేపడుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్ల జేపీ నడ్డా సంతృప్తి వ్యక్తం చేశారని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టాలని నడ్డా తమను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

 

కర్ణాటక తరహా డ్రామాలు తెలంగాణలో సాగవు: బీజేపీపై కేటీఆర్

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాపై  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 

చేజేతులా మేమే చేసుకున్నాం, బీజేపీకి మ్యాటర్ లేదు: ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. 
 

 

మళ్లీ వార్తల్లోకి కేఏపాల్... నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

కేఏపాల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. తన సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణ మిగితా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్ హాజరుకాలేదు. 

 

ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?

మాజీ ఎంపీ  గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసెంబ్లీ సెక్రటరీ నుండి సోమవారం నాడు ఆయన ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రాన్ని కూడ తీసుకొన్నారు. 

 

ఆ ఉద్యమానికి అవసరమైతే జగన్ ను కూడా కలుస్తాం: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారంటూ మండిపడ్డారు. కేవలం ప్రెస్మీట్లతోనే సరిపెట్టుకుంటున్నారని పోరాటాన్ని మరచిపోయినట్లున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. 

 

వామ్మో.. రకుల్ బికినీ ఫోజులు..మాములుగా లేవుగా!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ కెరీర్ ఈ మధ్య బాగా స్లో అయింది.
 

 

సాహో ఈవెంట్ లో కంటతడి పెట్టిన ప్రభాస్

ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించింది. వేల సంఖ్యల అభిమానుల మధ్యలో వేడుక అట్టహాసంగా జరిగింది.

 

'ఇస్మార్ట్ శంక‌ర్‌' బిజినెస్ క్లోజ్...లాభం ఇదీ!

పూరి జగన్నాధ్ వరుస పరాజయాల తర్వాత సంచలనమే చేశాడు. తన సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి పూరి నిరూపించాడు. పూరి జగన్నాధ్ ఎక్కువగా మాస్ చిత్రాలనే తెరక్కిస్తుంటాడు.

 

ఆఫర్ అడిగితే...రామ్ గోపాల్ వర్మ సెక్స్ వీడియో పంపాడు!

మిడ్ డే పత్రిక షెర్లిన్ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా..యాంకర్ రాంగోపాల్ వర్మ  గురించి ప్రస్తావించారు.  మీకు రాంగోపాల్ వర్మ ఏదో ఆఫర్ ఇచ్చాడని విన్నాము నిజమేనా అని ఆయన అడిగితే ఆమె ఇలా స్పందించింది.  

 

పది కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన సీనియర్ నటి!

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. 13 ఏళ్ల పాటు తెరకు దూరమైనా యోగా వీడియోలు చేస్తూ బిజీగా గడిపారు. ఇప్పుడు ఇదే ఫిట్‌నెస్‌కు సంబంధించి ఓ కంపెనీ ఆమెకు ఓ ఆఫర్‌ ఇచ్చింది.


తమ్ముడే అతిథి.. మెగాస్టార్ బర్త్ డే వేడుకలకు క్రేజీ ప్లాన్!

మెగాస్టార్ చిరంజీవి 64వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి ఏటా మెగా ఫ్యామిలీ చిరు పుట్టినరోజు వేడుకల్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 22న శిల్పకళా వేదికలో భారీ చిరు బర్త్ డే సందర్భంగా భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. 

 

బికినిలో అనుష్క.. కోహ్లీ రియాక్షన్ ఎలా ఉందంటే?

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్కా శర్మ ఎన్నేళ్లయినా ఇండస్ట్రీలో ఇంకా తన క్రేజ్ ని ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ పెళ్లయిన తరువాత కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో సెట్ చేసుకుంటోంది. 

 

బాబూ! అక్రమ నివాసాన్ని ఖాళీ చేయకుండా రాజకీయాలేంటి : జగన్ కి జనచైతన్య వేదిక మద్దతు

చంద్రబాబు తాను ఉంటున్న అక్రమ భవనాన్ని ఖాళీ చేసి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. వరద వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వరద ప్రవాహాన్ని ప్రభుత్వం నియంత్రించడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. 

 

భారీ స్థాయిలో వరదలు.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.. మంత్రి అనిల్ కుమార్

రాయలసీమకు నీరువ్వడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించలేదని స్పష్టం చేశారు. అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించడం మాత్రమే తమ బాధ్యత కాదని.. క్షేత్ర  స్థాయిలో ప్రజల బాగోగులను పంచుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. 

 

నేతల వరుస క్యూ: తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టేనా?

టీడీపీకి చెందిన  నేతలు వరుసగా ఇతర పార్టీల్లో చేరడంతో ఆ పార్టీ శకం ముగిసిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

 

click me!