చెన్నై: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు సినీనటి శ్రీరెడ్డి. జనసేన పార్టీని కలపాలంటూ ఒక పార్టీ ఎదురుచూస్తుందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందించారు. 

పవన్ కళ్యాణ్ మీ పార్టీని మరే ఇతర పార్టీలో కలపొద్దంటూ హితవు పలికారు. ఒక్క విషపు చుక్క కూడా విలువైన మెుత్తం ద్రావణాన్ని పాడుచేస్తోంది. మీరు మాకొద్దంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

మరోవైపు మెగాపవర్ స్టార్, హీరో రామ్ చరణ్ తేజ్ కు అభినందనలు తెలిపారు శ్రీరెడ్డి. సాక్షి అవార్డుల ప్రదానోత్సవంలో రామ్ చరణ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్న శ్రీరెడ్డి, తన అభినందనలు తెలిపారు.