Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు ఇంటి వద్ద డ్రోన్... గవర్నర్ కి టీడీపీ నేతల ఫిర్యాదు

గవర్నర్ ని కలిసిన వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామారావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సహా 15మంది సభ్యుల బృందం  ఉన్నారు. అంతక ముందు కృష్ణా నది వరద ఉధృతికి ముంపు బారిన పడిన ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారితో వారు చర్చించారు. 

TDP Leaders meet governor Biswabhushan over drone camera shoot near chandrababu house
Author
Hyderabad, First Published Aug 19, 2019, 1:03 PM IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం వద్ద డ్రోన్ ఎగురవేయడాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ విషయాన్ని చాలా సీరీయస్ గా తీసుకున్న టీడీపీ నేతలు సోమవారం గవర్నర్ బిశ్వ భూషణ్ కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాలుగు పేజీల లేఖను గవర్నర్ కు అందజేశారు.

ప్రతిపక్ష నేత ఇంటి వద్ద డ్రోన్ ఎగురవేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ఈ  సందర్భంగా గవర్నర్ ని కలిశారు. గతంలో చంద్రబాబు భద్రతను కుదించిన ప్రభుత్వం తర్వాత హైకోర్టు ఆదేశాల తర్వాత తిరిగి భద్రతను పెంచడాన్ని టీడీపీ నేతలు గవర్నర్ కి గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకుంటోందని.. డ్రోన్ ఎగురవేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్ నివాసంలో ఉండే  కిరణ్ ఆదేశాల మేరకే ఇలా చేశానని చెప్పడం పలు అనుమానాలకు దారి తీస్తోందని వారు చెప్పారు.

గవర్నర్ ని కలిసిన వారిలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామారావు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సహా 15మంది సభ్యుల బృందం  ఉన్నారు. అంతక ముందు కృష్ణా నది వరద ఉధృతికి ముంపు బారిన పడిన ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారితో వారు చర్చించారు.  అంతక ముందు కృష్ణా నది వరద ఉధృతికి ముంపు బారిన పడిన ప్రాంతాలను టీడీపీ నేతలు పరిశీలించారు. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారితో వారు చర్చించారు. 

కృష్ణా నది దిగువున ఉన్న ప్రాంతాల్లో ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయకపోవడంతో భారీ ఆస్తి నష్టం సంభవించిందని బాధితులు చెబుతున్నారు. దీంతో బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని ఈ సందర్భంగా టీడీపీ నేతలు వారికి హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios