తావి వరదల్లో ఇద్దరు: హెలికాప్టర్ ద్వారా రక్షించిన అధికారులు

Published : Aug 19, 2019, 02:02 PM IST
తావి వరదల్లో ఇద్దరు: హెలికాప్టర్ ద్వారా రక్షించిన అధికారులు

సారాంశం

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని తావి నదికి ఆకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా చిక్కుకొన్న ఇద్దరిని రక్షించారు. 

జమ్మూ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో తావి నదికి ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయి.ఈ సమయంలో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న ఇద్దరిని హెలికాప్టర్ ద్వారా అధికారులు రక్షించారు. 

జమమూ కాశ్మీర్ రాష్ట్రంలో బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో  కార్మికులు పనిచేస్తున్నారు. అయితే తావి నదికి సోమవారం నాడు మధ్యాహ్నం ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయి. ఈ వరదల కారణంగా ఇద్దరు కార్మికులు వరదల్లో చిక్కుకొన్నారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.

హెలికాప్టర్ సహాయంతో  ఇద్దరిని అధికారులు రక్షించారు. వరదల్లో చిక్కుకొన్న ఇద్దరిని బయటకు తీసుకురావడంతో బాధిత కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకొన్నారు.
 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్