దేశం మెచ్చిన దర్శకుడు శంకర్ అలాగే నటనలో లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇండియన్ 2. అతి కష్టం మీద మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ తో బిజీ అయినా శంకర్ సినిమాలో ఎక్కువగా ఒక సోషల్ పాయింట్ పై ఫోకస్ చేశాడట. 

సాధారణంగా తన ఏ సినిమాల్లో అయినా ప్రస్తుత పరిస్థితుల గురించి ఎదో ఒక సందేశం ఇచ్చే దర్శకుడు ఇప్పుడు అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి చూపించనున్నాడట. పసి బాలికల నుంచి పెను ముసలి వారి వరకు ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్న తీరును సినిమాలో ఎలివేట్ చేసి ఈ సమస్యకు ముగింపు పలికే విధంగా కమల్ సేనాపతి పాత్రను రీ ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సామజిక అంశాలను హైలెట్ చేస్తూనే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ పై కూడా శంకర్ ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలనీ టార్గెట్ గా పెట్టుకొని షెడ్యూల్స్ ని కొనసాగిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.