ప్రభాస్ నటించిన సాహో చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఆదివారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించింది. వేల సంఖ్యల అభిమానుల మధ్యలో వేడుక అట్టహాసంగా జరిగింది. ఇక ప్రభాస్ సినిమా వేడుకలో కొంత భావోద్వేగానికి లోనయ్యారు.

రాజమౌళి మాట్లాడుతుండగా ప్రభాస్ కాస్త ఎమోషనల్ అయ్యాడు.అలాగే పెదనాన్న కృష్ణంరాజు స్పీచ్ కి కూడా ప్రభాస్ కంటతడి పెట్టుకున్నాడు.సైలెంట్ గా నవ్వుకుంటూ కనిపించే ప్రభాస్ ఒక్కసారిగా అలా కనిపించే సరికి టీవీ చూస్తున్న చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. గతంలో బాహుబలి ఆడియో వేడుకలో రాజమౌళి అన్న కీరవాణి పాటకు ఎమోషనల్ అయినట్టు ఇప్పుడు అదే ప్లేస్ లో మళ్ళీ ప్రభాస్ కూడా కొంత ఎమోషనల్ అయ్యాడు. 

ఏ తెలుగు హీరో చేయని విధంగా తన సినిమా వరల్డ్ వైడ్ గా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ అవుతుండడం, అలాగే తను ఈ స్థాయికి వచ్చేలా చాలా మంది కష్టపడ్డారని అందుకు ప్రభాస్ ఎమోషనల్ అయ్యారని సన్నిహితుల ద్వారా తెలిసింది. అందుకు సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.