అమరావతి: ఎలాంటి కుట్ర లేదు.... ఈ విషయమై రాజకీయం చేయకూడదని  డీజీపీ గౌతం సవాంగ్ టీడీపీ నేతలకు సూచించారు.చంద్రబాబునాయుడు నివాసంపై  డ్రోన్ వినియోగంపై టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. 

సోమవారం నాడు డీజీపీ గౌతం సవాంగ్ ను ఈ విషయమై స్పందించారు. హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్న చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ కెమెరాను ఎలా ఉపయోగిస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

వరద పరిస్థితిని అంచనా వేసేందుకే డ్రోన్ కెమెరాను ఉపయోగించారని డీజీపీ వివరించారు. డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్న విషయాన్ని స్థానిక పోలీసులకు చెప్పని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని డీజీపీ అభిప్రాయపడ్డారు.

డ్రోన్ కెమెరాను ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతిని తప్పకుండా తీసుకోవాలని  ఆయన ఆదేశించారు. చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించడంపై ఎలాంటి కుట్ర లేదని ఆయన తేల్చేశారు. ఈ విషయమై రాజకీయం చేయకూడదని టీడీపీ నేతలకు డీజీపీ సూచించారు.

సంబంధిత వార్తలు

వదలను బొమ్మాళి: చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

ఉండవల్లి 'అద్దె' ఇంటిపై చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు?

చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్: మంత్రులకు చుక్కెదురు

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే