పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రుణాల విషయంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలతో కొందరు వ్యక్తులు ప్రైవేట్ బ్యాంకులకు సుమారు రూ. 370 కోట్లు కుచ్చుటోపీ పెట్టినట్లు సమాచారం.

దీనిపై ఫిర్యాదులు అందుకున్న సీబీఐ అధికారులు విచారణ ప్రారంభించారు. భీమవరంతో పాటు జిల్లా వ్యాప్తంగా రుణాలు తీసుకున్న వారి రికార్డులను కూడా గత రెండు రోజులు పరిశీలిస్తున్నారు.

అక్వా రంగానికి కేరాఫ్‌గా నిలిచే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఈ రంగంలో ఉన్న వారికే బ్యాంకులు రుణాలు ఇస్తుంటాయి. ఇదే అదునుగా కొందరు నకిలీ పత్రాలను సమర్పించి బ్యాంకులను మోసం చేసినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారంలో భీమవరం పట్టణానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు కథనాలు ప్రసారమవుతున్నాయి. 

రుణాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు:

1. ఆర్. దామోదరన్ (కోయంబత్తూరు)
2. భట్టు రామారావు (హైదరాబాద్)
3. రెబ్బ సత్యనారాయణ (మచిలీపట్నం)
4. మోహన్ రాజు (హైదరాబాద్)
5. మంతెన ఆంజనేయ రాజు (హైదరాబాద్)
6. కాటం లక్ష్మీ నారాయణ (హైదరాబాద్)
7. రుద్రరాజు శ్రీనివాస రాజు ( హైదరాబాద్)
8. పెన్మత్స వెంకట రామరాజు ( హైదరాబాద్)
9. జాన్సన్ (భీమవరం)
10. సత్యశేషగిరి రావు పోతురాజు
11. ఎంవీ శ్రీనివాసులు
12. రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ సాహు
13. ఎస్. వంశీకృష్ణ
14. సోమశేఖర్ రావు
15. చందన్ కుమార్ (ఛార్టెడ్ అకౌంటెంట్)