మొయిన్ ఖురేషీ కేసు: సానా సతీష్‌కు బెయిల్

Published : Aug 19, 2019, 04:25 PM ISTUpdated : Aug 19, 2019, 04:30 PM IST
మొయిన్ ఖురేషీ కేసు: సానా సతీష్‌కు బెయిల్

సారాంశం

మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో సానా సతీష్ కు సోమవారం నాడు బెయిల్ లభించింది.

న్యూఢిల్లీ:మనీ లాండరింగ్ కేసులో స్పెషల్ కోర్టు సోమవారం నాడు వ్యాపార వేత్త సానా సతీష్ కు  బెయిల్ మంజూరు చేసింది.

సానా సతీష్ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.ఈ పిటిషన్ పై ప్రత్యేక కోర్టు జడ్జి అనురాధ శుక్లా భరద్వాజ్ బెయిల్ మంజూరు చేశారు.రూ. 5 లక్షల విలువైన ష్యూరిటీని కూడ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది జూలై మాసంలో  మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో సానా సతీష్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ అధికారుల విచారణలో సానా సతీష్  మొయిన్ ఖురేషీకి అత్యంత సన్నిహితుడుగా గుర్తించారు.

న్యూఢిల్లీ వేదికగా మొయిన్ ఖురేషీ హావాలా వ్యాపారం చేసేవాడు. తనను ఈ కేసు నుండి బయటపడేసేందుకు గాను సీబీఐ అధికారులు లంచం అడిగారని మొయిన్ ఖురేషీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్