బాలీవుడ్ నటి శిల్పా శెట్టి తన బాడీ ఫిట్నెస్ కి ఎంతగా ప్రాధాన్యతనిస్తుందో తెలిసిందే. సినిమాలకు దూరమై పదేళ్లు దాటుతున్నా ఇప్పటి యంగ్ హీరోయిన్లకు ఎంతమాత్రం తీసిపోకుండా ఫిజిక్ మైంటైన్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇదే ఫిట్నెస్ కి సంబంధించి ఓ కంపనీ ఆమెకి ఓ ఆఫర్ ఇచ్చింది. 

ప్రముఖ ఆయుర్వేద కంపనీ సన్నబడడానికి వాడే మాత్రలకు ప్రచారకర్తగా వ్యవహరించాలని.. దానికి గాను రూ.10 కోట్లు ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే దానికి శిల్పా అంగీకరించలేదు. తాను నమ్మని విషయాలను ప్రజలకుచెప్పలేనని తేల్చిచెప్పేసింది. సరైన ఆహార పద్దతులు ఫాలో అవుతుంటే ఫిట్నెస్ దానంతట అదే వస్తుందని.. సహజ పద్దతుల ద్వారా బరువు తగ్గితేనే ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది.

ఆ కంపనీ ఆఫర్ అంగీకరించేలా ఉన్నా.. తన మనసుకి నచ్చని పని చేయనని వెల్లడించింది. ఏవో మాత్రలు వేసుకోవడం వలన సన్నబడరని జీవన శైలిలో మార్పులు 
చేసుకుంటే కాస్త ఆలస్యంగా అయినా సన్నబడొచ్చని చెప్పుకొచ్చింది. ఫిట్నెస్, ఆరోగ్యకరమైన ఫుడ్ కి సంబంధించిన శిల్పాశెట్టి ఓ యాప్ ని కూడా తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా ఆహార నియమాలు, ఫిట్నెస్ సలహాలను అడిగి తెలుసుకోవచ్చు.

ఇక సినిమాల విషయానికొస్తే.. దశాబ్ద కాలం తరువాత శిల్పా మళ్లీ వెండితెరపై కనిపించనుంది. షబ్బీర్ ఖాన్ తెరకెక్కిస్తోన్న 'నికమ్మ'తో మరోసారి బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది!