Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీగా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవం: మంత్రి పదవికి దక్కేనా?

మాజీ ఎంపీ  గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అసెంబ్లీ సెక్రటరీ నుండి సోమవారం నాడు ఆయన ఎన్నికైనట్టు ధృవీకరణ పత్రాన్ని కూడ తీసుకొన్నారు. 

sukhender reddy unanimously elected as mlc
Author
Hyderabad, First Published Aug 19, 2019, 4:48 PM IST


హైదరాబాద్: గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవికి సుఖేందర్ రెడ్డి మినహా ఎవరూ  నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ సెక్రటరీ నుండి ఆయన ధృవీకరణ పత్రాన్ని తీసుకొన్నారు.

sukhender reddy unanimously elected as mlc

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇతర పార్టీల నుండి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

sukhender reddy unanimously elected as mlc

కేసీఆర్ తన కేబినెట్ లోకి సుఖేంద్ రెడ్డిని తీసుకొంటారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారని చెబుతున్నారు.కేసీఆర్ త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించే చాన్స్ ఉంది. సుఖేందర్ రెడ్డితో పాటు సబితా ఇంద్రారెడ్డికి మంత్రివర్గంలో చాన్స్ దక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

sukhender reddy unanimously elected as mlc

ఈ దఫా మంత్రివర్గ విస్తరణ  జరిగితే కేటీఆర్, హరీష్ రావులకు కూడ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుందంటున్నారు.

sukhender reddy unanimously elected as mlc

Follow Us:
Download App:
  • android
  • ios