తిరుపతి :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై  సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు నిందలు వేస్తున్నారని ఆరోపించారు ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పృథ్వీరాజ్. జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం సిగ్గు చేటంటూ విరుచుకుపడ్డారు. అనవసరపు మాటలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. 

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో గతంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి తీరుతామని తెలియజేశారు. భక్తి ఛానల్‌ అక్రమాల మీద చాలా ఆరోపణలు ఉన్నాయని, వాటన్నింటినీ నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. 

ఎస్వీబీసీ ఛానెల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చారు. అందుకోసం సీఎం జగన్ ను ఒప్పిస్తానని తెలియజేశారు. అవసరమైతే  సీఎం కాళ్లు పట్టుకుని అయినా ఎస్వీబీసీలో పనిచేస్తున్న 286 మంది ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.