హైదరాబాద్: అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని పొరపాట్లవల్లనే తాము ఓడిపోయామని తెలిపారు. పరోక్షంగా చేజేతులా చేసుకున్న పొరపాట్లే ఓటమికి కారణం అంటూ చెప్పుకొచ్చారు. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనా 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తామని తెలిపారు. 

ఈనెల 26 నుంచి నార్కెట్ పల్లి నుంచి పాదయాత్ర చేపట్టబోతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. 

మరోవైపు బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ తోకపార్టీలా మారిందని విమర్శించారు. బీజేపీ చేసేది అంతా హడావిడి మాత్రమేనని కానీ విషయం లేదంటూ పంచ్ లు వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి 

జగన్ పాలనపై కోమటిరెడ్డి ప్రశంసలు: పార్టీ మార్పుపై వెనక్కితగ్గని రాజగోపాల్ రెడ్డి

హలో బ్రదర్స్: కాంగ్రెస్ అధిష్టానంతో కోమటిరెడ్డి బ్రదర్స్ ఆటలు

కోమటిరెడ్డి రాజగోపాల్ పై విహెచ్ పరోక్ష దండయాత్ర

కోమటిరెడ్డిని ఎందుకు చేర్చుకోలేదు, బీజేపీకి టులెట్ బోర్డు తప్పదు: పొన్నం ప్రభాకర్

కోమటిరెడ్డిని ఎన్నిసార్లు వదిలేస్తారు, ఇదేమైనా నల్గొండ కాంగ్రెస్సా..?: వీహెచ్ ఫైర్