నాగార్జున హోస్ట్ చేస్తోన్నబిగ్ బాస్ 3 రియాలిటీ షో నాలుగు వారాలు పూర్తి చేసుకొంది. ప్రతీవారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ ప్రస్తుతం హౌస్ లో 12 మంది మాత్రమే మిగిలారు. తొలివారం హేమ.. రెండో వారంలో జాఫర్.. మూడో వారంలో తమన్నా.. నాలుగో వారంలో రోహిణి ఎలిమినేట్ కాగా.. ఐదో వారంలో జరగబోయే ఎలిమినేషన్  కి సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్స్ మొదలయ్యాయి.

దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఇంటిలో కొనసాగడానికి అనర్హులు అనుకునేవారికి ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించడంతో గొడవ మొదలైంది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ పునర్నవి.. రాహుల్ కి రంగు పూసి నామినేట్ చేసింది.

పునర్నవికి కూడా రంగు పూస్తూ నామినేట్ చేశారు. ఈ నామినేషన్ ప్రాసెస్ లో పునర్నవి-హిమజల మధ్య సీరియస్ డిస్కషన్స్ జరుగుతోంది. అషు రెడ్డి కూడా శ్రీముఖిపై ఫైర్ అయింది. హిమజ, అషులకు మధ్య కూడా రచ్చ జరిగినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.

మరి ఈ వారం ఎలిమినేషన్ కి ఎవరు నామినేట్ కాబోతున్నారో మరికొద్ది గంటల్లో తెలియనుంది!