Asianet News TeluguAsianet News Telugu

'ఇస్మార్ట్ శంక‌ర్‌' బిజినెస్ క్లోజ్...లాభం ఇదీ!

పూరి జగన్నాధ్ వరుస పరాజయాల తర్వాత సంచలనమే చేశాడు. తన సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి పూరి నిరూపించాడు. పూరి జగన్నాధ్ ఎక్కువగా మాస్ చిత్రాలనే తెరక్కిస్తుంటాడు.

ISmart Shankar making a profit of Rs 22 Cr
Author
Hyderabad, First Published Aug 19, 2019, 12:03 PM IST

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.  పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మించిన ఈ చిత్రంలో  నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం జూలై 18న ప్రపంచవ్యాప్తంగా విడుద‌లై ,స‌క్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటింది. ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం రూ. 38 నుంచి 40 కోట్ల గ్రాస్‌ షేర్ ను సాధించింది. రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ ఇది. ఇన్నాళ్లూ రామ్ ...హిట్ రేంజ్ అంటే 25 కోట్ల వరకూ ఉంది. ఈ సినిమాతో ఒక్కసారిగా 40 కోట్లకు జంప్ చేసింది. 

ఇక ఖర్చు తో పోల్చుకుని లాభం చూస్తే...పూరి జగన్నాథ్ కు ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాని 17 కోట్లుకు అమ్మితే...లాభం 22 కోట్లు అదీ కేవలం థియోటర్ రెవిన్యూ నుంచి వచ్చింది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్, మిగతా భాషల డబ్బింగ్ రైట్స్ అదనంగా మిగులుతాయి. 

హీరో రామ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా చూశాక ఎలా ఫీల్ అయ్యానో ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక అదే ఫీల్ అయ్యాను. నేను ఇదివరకు చేస్తున్న పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉందంటే.. అందుకు కారణం పూరీ గారు. నాకు ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చి నన్ను డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసారు. ఈ సక్సెస్‌ను నా మంచి కోరుకునే వారందరికీ డెడికేట్ చేస్తున్నాను. మణిశర్మగారి సంగీతం, హీరోయిన్స్ గ్లామర్ సినిమా సక్సెస్‌కు యాడ్ అయ్యాయి. సినిమాలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను’’ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios