Asianet News TeluguAsianet News Telugu

ఆఫర్ అడిగితే...రామ్ గోపాల్ వర్మ సెక్స్ వీడియో పంపాడు!

మిడ్ డే పత్రిక షెర్లిన్ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా..యాంకర్ రాంగోపాల్ వర్మ  గురించి ప్రస్తావించారు.  మీకు రాంగోపాల్ వర్మ ఏదో ఆఫర్ ఇచ్చాడని విన్నాము నిజమేనా అని ఆయన అడిగితే ఆమె ఇలా స్పందించింది.  

Sherlyn Chopra Accuses Ram Gopal Verma
Author
Hyderabad, First Published Aug 19, 2019, 12:11 PM IST

 

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై వచ్చిన మరో ఆరోపణ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో నే కాదు మీడియాలోనూ హాట్ టాపిక్ గానూ మారింది. నాకు మీ సినిమాలో వేషం కావాలంటూ వర్మకు మెసేజ్ చేస్తే..  సెక్స్ వీడియో పంపించాడు నటి షెర్లిన్ చోప్రా కామెంట్స్ చేసారు.  ‘మిడ్ డే' పత్రికతతో ఆమె మాట్లాడుతూ...ఇలా వర్మపై ఆరోపణలు చేసింది.

మిడ్ డే పత్రిక షెర్లిన్ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా..యాంకర్ రాంగోపాల్ వర్మ  గురించి ప్రస్తావించారు.  మీకు రాంగోపాల్ వర్మ ఏదో ఆఫర్ ఇచ్చాడని విన్నాము నిజమేనా అని ఆయన అడిగితే ఆమె ఇలా స్పందించింది.  

షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ.. ‘నాకు మొదటి నుంచీ రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం. ఆయన సినిమాలు బాగా నచ్చుతాయి. వాటిలో హీరోయిన్‌ను బాగా చూపిస్తాడు. అది గమనించి ఆయనకు 2016లో వాట్సాప్‌లో నా ఫొటోలు, నా వివరాలు పంపుతూ... మీ సినిమాలో ఏదైనా వేషం  ఉంటే ఇవ్వండి అని అడిగాను' అని ఆమె చెప్పుకొచ్చింది.

అప్పుడు వర్మ తన మెసేజ్‌కు వర్మ రిప్లై ఇస్తూ.... ‘ఓ స్క్రిప్టు పంపిస్తున్నాను. ఇది చదవి చెప్పు. నచ్చితే వెంటనే సినిమా చేద్దాం' అన్నారట. ‘ఏక్‌థా రాజా ఏక్‌థి రాణి' అనే టైటిల్ ఉన్న ఆ స్క్రిప్టు చదివింది. అందులో సెక్స్ సీన్స్ తప్ప కథ ఏమీ కనిపించలేదని షెర్లిన్ చెప్పుకొచ్చింది.  ఆ కథ మొత్తం ఓ రాజు రాణికి మధ్య శృంగారం, అందుకు సంభందించిన సీన్స్ మాత్రమే ఉన్నాయంది. అదే విషయాన్ని వర్మకు రిప్లై చేసానని దానికి ఆయన మాత్రం కూల్ గా..నీకు కథ నచ్చితే చెప్పు లేకపోతే లేదు అన్నాడని వివరించింది.

అక్కడితో ఆగకుండా ఆ తర్వాత రాంగోపాల్ వర్మ తనకు సెక్స్ వీడియో పంపాడని షెర్లిన్ తెలిపింది. ‘ఈ కథేంటి ఇలా ఉందంటూ నేను అడగగా వర్మ నాకో వీడియో పంపాడు.  అందులో ఓ మహిళ కుక్కతో సెక్స్ చేస్తున్న సీన్స్ ఉన్నాయి. అది చూసి నేను షాక్ అయ్యా. వెంటనే కోపంగా నాకెందుకు ఇది పంపారని కోపంగా అడిగా.... దీనికి ఆయన ‘సెక్స్ సీన్స్ ఉన్నాయని నువ్వు సినిమా చేయనంటున్నావు. వాస్తవానికి సెక్స్ అనేది సాధారణ విషయం అది మనుషులకైనా.. పశువులకైనా. అది చెప్పాలనే ఈ వీడియో పంపాను' అని వర్మ చెప్పుకొచ్చారని షెర్లిన్ పేర్కొంది.

అయితే ఇన్నాళ్లూ ఈ విషయం బయిట పెట్టకపోవటానికి కారణం.. ‘వర్మ నాకు ఆ వీడియో పంపడంతో  నాకు చాలా కోపం వచ్చిన మాట నిజమే. అయితే ఆయన్ని నేనే ఆఫర్ కావాలని అడగాను. అది నా తప్పు. అందుకే ఆయనను ఏమీ అనలేదు. కానీ, నేను సెక్స్‌లో పీహెచ్‌డీ చేయలేదు అని మాత్రం రిప్లై ఇచ్చానని, అప్పటి నుంచి వర్మకు మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయలేదు. వ్యక్తిగతంగా కూడా కలవలేదు' అని ఆమె వెల్లడించింది.

Follow Us:
Download App:
  • android
  • ios