'జబర్దస్త్' కామెడీ షోలో లేడీ గెటప్స్ లో కనిపిస్తూ కమెడియన్ వినోద్ అలియాస్ వినోదిని మంచి మార్కులు కొట్టేశాడు. తన హావభావాలు, నటన అచ్చం అమ్మాయిలానే ఉండడంతో బాగా క్లిక్ అయ్యాడు. అయితే ఇటీవల ఓ ఇంటిని కొనుగోలు చేసే విషయంలో ఏర్పడిన వివాదం కారణంగా వినోద్ గాయాలపాలయ్యాడు.

కాచిగూడలోని కుత్బిగూడాలో ఇంటి ఓనర్, కొందరు దుండగులు కలిసి చేసిన దాడిలో వినోద్ తీవ్రంగా గాయపడ్డారు. తలపై, ముఖంపై బలమైన గాయాలు కావడంతో స్నేహితులు అతడిని హాస్పిటల్ కి తరలించారు. కొద్దిరోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్న వినోద్ ప్రస్తుతం కోలుకొని తనపై జరిగిన దాడి గురించి వెల్లడించాడు.

దాడి జరిగిన తరువాత తనకు ఓ కన్ను సరిగ్గా కనిపించడం లేదని చెబుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తాను లేడీ గెటప్పులో రాణించడానికి ప్రధాన కారణం తన కళ్లే అని.. ఆ కళ్లలో ఒకటి చిన్నగా అయిపోవడం అదేవిధంగా సరిగ్గా కనిపించకపోవడంతో తనకు భయమేస్తుందని చెప్పాడు. తన కన్ను చిన్నగా అయిన కారణంగా లేడీ గెటప్ సూట్ అవ్వదని అందరూ భావిస్తున్నారని.. ఇక అవకాశాలు రావేమోనని టెన్షన్ పడుతున్నారు. 

ఆ కన్నును రోజూ అద్దంలో చూసుకొని ఏడుస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. తను ఉంటోన్న ఇల్లు కొందామని ఓనర్ కి పది లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెబితే అతడు మోసం చేయడమే కాకుండా తన మనుషులతో కొట్టించాడని వినోద్ వెల్లడించాడు.