హైదరాబాద్: కర్ణాటక  రాష్ట్రంలో చేసినట్టుగా నాటకాలు చేయడం తెలంగాణలో సాధ్యం కాదని బీజేపీ నేతలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్చరించారు. తమ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని  ఆరోపణలు చేస్తున్నారు. అవినీతిపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సోమవారం నాడు కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు కూడ హాజరయ్యారు.

కర్ణాటక రాష్ట్రంలో చేసినట్టుగా డ్రామాలు చేయడం తెలంగాణలో సాధ్యం కాదన్నారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్  జేపీ నడ్డా హైద్రాబాద్ వేదికగా అన్ని అబద్దాలు మాట్లాడినట్టుగా ఆయన విమర్శలు గుప్పించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 119  స్థానాల్లో పోటీ చేస్తే ఎన్ని స్థానాల్లో గెలుపొందిందని కేటీఆర్ ప్రశ్నించారు.  మెజార్టీ స్థానాల్లో బీజేపీ డిపాజిట్లను కోల్పోయిన విషయాన్ని కేటీఆర్ చెప్పారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా కూడ ప్రజలు బీజేపీని ఓడించారని ఆయన చెప్పారు.

బీజేపీ నేతలు చిల్లర ప్రచారాన్ని మానుకోవాలన్నారు. గత ఐదేళ్లలోతెలంగాణ రాష్ట్రానికి  బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు.  తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే కేంద్ర ప్రభుత్వం కూడ కాపీ కొట్టి అమలు చేస్తోందని కేటీఆర్ సెటైర్లు వేశారు.

తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు వంటి పథకాలను కేంద్రం ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.జేపీ నడ్డా తప్పుడు ప్రచారాన్ని  తెలంగాణ బిడ్డలు నమ్మరని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కార్యకర్తల గొంతు కోశారు, నన్ను అడ్డుకున్నారు : టీడీపీలో అవమానాలపై గరికపాటి కంటతడి

దేశాన్ని ప్రగతిపథంలో నడిపించే సత్తా బీజేపీకే ఉంది: జేపీ నడ్డా

తల్లిలాంటి టీడీపీని వదిలి మనసు చంపుకుని బీజేపీలో చేరుతున్నా: గరికపాటి

హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా పర్యటన (ఫోటోలు)

మన టార్గెట్ బీజేపీ జెండా ఎగురవేయడమే: టీ-బీజేపీ నేతలతో జేపీ నడ్డా

శంషాబాద్‌ చేరుకున్న జేపీ నడ్డా, ఘనస్వాగతం పలికిన నేతలు