అమరావతి: మాజీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి ఫోటోలు, వీడియోలు తీయడంపై ప్రైవేట్ కేసు దాఖలు చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

హై సెక్యూరిటీ జోన్ గా ఉన్న ప్రాంతంలో అనుమతి లేకుండానే  డ్రోన్ కెమెరాను ఉపయోగించడంపై  టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై సోమవరాం నాడు టీడీపీ నేతలు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబునాయుడు నివాసం పై డ్రోన్ ఉపయోగించడంపై సోమవారం నాడే ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ కూడ స్పందించారు.వరద పరిస్థితిని అంచనా వేసేందుకే డ్రోన్ కెమెరాను ఉపయోగించినట్టుగా డీజీపీ స్పష్టం చేశారు. ఈ విషయమై రాజకీయం చేయకూడదని డీజీపీ టీడీపీ నేతలకు సూచించారు.

చంద్రబాబునాయుడు ఎన్ ఎస్ జీ  సెక్యూరిటీ పర్యవేక్షణలో ఉన్నాడు. బాబు నివాసం ఉండే  ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్ గా పరిగణస్తారు. ఈ పరిస్థితుల్లో వరదల పరిస్థితిని అంచనా వేసేందుకు గాను చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాను వాడారు. 

ఈ విషయాన్నిటీడీపీ సీరియస్ గా తీసుకొంది. హైద్రాబాద్ లోనే ఉన్న చంద్రబాబునాయుడు ఈ విషయమై జిల్లా ఎస్పీతో పాటు డీజీపీతో ఫోన్ లో మాట్లాడారు.  టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ సీపీ నేతలు  టీడీపీ విమర్శలకు ధీటుగానే సమాధానం చెప్పారు.

వరద పరిస్థితిని అంచనా వేసేందుకే డ్రోన్ ను ఉపయోగించినట్టుగా ఇరిగేషన్ అధికారులు కూడ ప్రకటించారు. చంద్రబాబు నివాసాన్ని కెమెరాతో రికార్డు చేసి ఎవరికిస్తారని  టీడీపీ నేతలు ప్రశ్నించారు. 

ఈ విషయాన్ని వదలకూడదని టీడీపీ నాయకత్వం భావిస్తోంది.  హై సెక్యూరిటీ జోన్ లో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఉపయోగించడంపై ప్రైవేట్ కేసు దాఖలు చేయాలని  టీడీపీ నిర్ణయం తీసుకొంది.

ఇవాళ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన తర్వాత టీడీపీ నేతలు ఈ విషయాన్ని ప్రకటించారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబు వన్ మ్యాన్ షో, ఇప్పుడది లేదు: విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

కుట్రలేదు, రాజకీయం వద్దు: డ్రోన్ వివాదంపై డీజీపీ

వదలను బొమ్మాళి: చంద్రబాబు ఇల్లు ఖాళీకి నోటీసులు జారీ

ఉండవల్లి 'అద్దె' ఇంటిపై చంద్రబాబు రాద్ధాంతం ఎందుకు?

చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్: మంత్రులకు చుక్కెదురు

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే

డ్రోన్ వినియోగంపై పోలీసులకు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ జనార్థన్ ఫిర్యాదు

వరద అంచనా కోసమే డ్రోన్ల వినియోగం, చంద్రబాబు ఇల్లు మునిగిపోతుంది: మంత్రి అనిల్

చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత: టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జీ

డ్రోన్ కెమెరా వినియోగం: చంద్రబాబు ప్రశ్నకు ఇరిగేషన్ శాఖ రిప్లై

డ్రోన్ల వెనుక కుట్ర బయటపెట్టాలి: డీజీపీకి బాబు ఫోన్

చంద్రబాబు నివాసానికి వరద ముప్పు: భవనం మెట్ల దాకా నీరు

డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసం ఫోటోలు, వీడియోలు: టీడీపీ ఫైర్

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే