జనసేనలో చిచ్చు: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Jul 30, 2019, 6:05 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ఆ ఆలోచనే నన్ను జనసేనవైపు నడిపించింది: పొలిటికల్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్

ప్రస్తుత రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన రాజకీయాన్ని తీసుకురావలన్నదే తన సంకల్పమని పవన్ తెలిపారు. అయితే రాజకీయ పార్టీ నడపడం అంత సులువైన పని కాదని ఇటీవలే తెలుసుకున్నానని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతే ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుండి రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. 

 

'బిగ్ బాస్'పై రేణు దేశాయ్ కామెంట్స్.. నేను అలాంటి వ్యక్తిని కాదు!

రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల రేణు దేశాయ్ పై మీడియా అంటెన్షన్ పెరిగింది. రేణు దేశాయ్ చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రేణుదేశాయ్ ప్రముఖ యాంకర్ ప్రేమతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా క్రేజీ షో బిగ్ బాస్ పై రేణుదేశాయ్ కామెంట్స్ చేసింది. 

 

జగన్ అంటే ఇష్టం: త్వరలో వైసీపీలోకి ప్రముఖ సినీనటి

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని హేమ నిర్ణయించుకున్నారు. తనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. త్వరలో తాను వైసీపీలో చేరతానేమోనంటూ క్లారిటీ ఇచ్చేశారు. బిగ్ బాస్ 3 నుంచి ఎలిమినేట్ అవ్వడం, బిగ్ బాస్ హౌస్ లో నటి హేమపై జరిగిన వ్యవహారంపై ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. 

 

జగన్ ని రక్తం పీల్చే జలగతో పోల్చిన లోకేష్.. వైసీపీ పై విమర్శలు

‘‘ రక్తం పీల్చేంత అవినీతికి మీ జలగన్న పెట్టింది పేరు’’ అంటూ సీఎం జగన్ ని జలగతో పోలిస్తూ... ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలు విమర్శలు చేయడం మానడం లేదన్నారు. తమపై విమర్శలు చేయడం మాని... పాలనపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.

 

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే....:నాగబాబు సంచలన వ్యాఖ్యలు

గతంలో తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయయని అందువల్ల తమ కుటుంబీకులు ఎవరూ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడాన్ని అంగీకరించలేదని తెలిపారు. 

 

శ్రీముఖి బయటకి ఒకలా, లోపల మరోలా.. హేమ కామెంట్స్!

బిగ్ బాస్ లో తను ఎలాంటి పొరపాట్లు చేయలేదని.. షోలో జరిగిన చాలా విషయాలను టెలికాస్ట్ చేయలేదని.. హౌస్ మేట్స్ తో వంట గది విషయంలో తను అరిచినవి మాత్రం ప్లే చేశారని చెప్పుకొచ్చింది నటి హేమ. ఎవరైతే తనను మోసం చేశారో.. వారు ఇప్పుడు నామినేషన్ లో ఉన్నారని పరోక్షంగా కామెంట్స్ చేసింది.

 

వైసీపీకి 100 రోజులే గడువు, ఆ తర్వాత చూపిస్తాం: పవన్ కళ్యాణ్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం తనను సంప్రదించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఒంటరిగా పోటీ చేయాలని తాను భావించానని ఆ నేపథ్యంలో వారితో పొత్తులు పెట్టుకోలేదని తేల్చి చెప్పారు. అంతేకానీ చీకటి పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు.

 

విషయం తెలీకుండా మాట్లాడుతున్నావు.. లోకేష్ పై మండిపడ్డ విజయసాయి

ఇక బందరు పోర్టును మరో రాష్ట్రానికి ఎలా అప్పగిస్తారో ఇంగిత జ్ఞానం ఉన్నవారెవికీ అర్థం కాదంటూ సెటైర్లు వేశారు. ఓటుకు నోటు కేసులో పారిపోయి వచ్చింది చంద్రబాబే కదా అని ప్రశ్నించారు

 

రోజా, పయ్యావుల కేశవ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీల్లో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మధ్య  మంగళవారం నాడు ఆసక్తికర సంభాషణ చోటు చేసుకొంది.  

 

కరెంట్ షాకిచ్చి... భార్యను చంపిన భర్త

మద్యానికి బానిసగా మారిన ఓ వ్యక్తి... ఆ మద్యం మత్తులోనే భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. కరెంట్ షాకిచ్చి మరీ భార్యను చంపేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా పెద్దారవీడులో చోటుచేసుకుంది.

 

పోలీసుల అదుపులో నిమ్మగడ్డ ప్రసాద్... కేంద్రం సహాయం కోరిన వైసీపీ

వాన్ పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డ పై రన్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితమే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెర్బియాకు ఆయన విహారయాత్రకు వెళ్లి అక్కడ పోలీసులకు చిక్కడం విశేషం.

 

జనసేనలో నాదెండ్ల మనోహర్ చిచ్చు: పవన్ కల్యాణ్ కు ప్రశ్నలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. 

 

చంద్రబాబుకు ఆగస్టు ఫీవర్: ఫిరాయింపులకు నేతలు రెడీ

శ్రావణ మాసంలో అంతా సందడే ఉంటుందంటూ బీజేపీ నేతలు ఆశతో ఉన్నారు. ఆగష్టు వస్తోందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

 

నష్టజాతకురాలిని కన్నావంటూ భర్త వేధింపులు: బిడ్డతో సహా బావిలో దూకి..

కూతురిని భర్త నష్టజాతకురాలు అనడాన్ని జీర్ణించుకోలేని ఓ వివాహిత బిడ్డతో సహా బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన జంగిరెడ్డి, లావణ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వీక్షిత సంతానం.

 

మూడు నెలలుగా అత్యాచారం: కన్నకూతురిని తల్లిని చేసిన తండ్రి

కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురిపై అత్యాచారానికి పాల్పడి ఆమెను తల్లిని చేశాడో తండ్రి. వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణక్రాక పంచాయతీలోని హనుమకొండపాళెం గ్రామానికి చెందిన కర్ర బాలరాజు బేల్దారి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

 

కర్ణాటక అయింది, ఇప్పుడిక తెలంగాణనే: బిజెపి నేత మురళీధర్ రావు సంచలనం

హైదరాబాద్: టీఆర్ఎస్‌ను ఇక నుండి ప్రతిక్షణం వెంటాడుతామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు.  రానున్న రోజుల్లో ప్రతిపక్షం ఎలా ఉంటుందో టీఆర్ఎస్ కు రుచి చూపిస్తామని  ఆయన స్పష్టం చేశారు.

 

సోనిని కిడ్నాప్ చేసిన రవి శేఖర్ అరెస్ట్

హైదరాబాద్: బీ.ఫార్మసీ విద్యార్ధిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ రవిశేఖర్‌ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. 

 

ఐడియల్ రోడ్ యూజర్ కు సీపీ అంజనీకుమార్ వినూత్న కానుక

ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో బైక్ నడుపుతూ నిబంధనలు పాటిస్తూ డ్రైవ్ చేస్తున్న వాహనదారులను అభినందించారు. దాదాపుగా 10ఏళ్లకు పైగా హైదరాబాద్ లో ఉంటూ నిబంధనలను పాటిస్తూ ఎలాంటి ఫైన్ పడకుండా రోడ్ ను యూజ్ చేస్తున్న వాహనదారులకు ఫ్లవర్ ఇచ్చి అభినందనలు తెలిపారు. 

 

షేక్‌పేట స్మశానవాటికలో పూర్తైన ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు  మంగళవారం నాడు అధికారిక లాంఛనాలతో షేక్‌పేటలోని స్మశానవాటికలో పూర్తయ్యాయి.

 

బిగ్ బాస్ 3: వామ్మో.. శ్రీముఖి పారితోషికం అంతా..!

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తొలివారం పూర్తి చేసుకుని రెండవ వారంలోకి ఎంటర్ అయింది. బిగ్ బాస్ సీజన్ 3 మొత్తం సెలెబ్రిటీ కంటెస్టెంట్స్ తో నిండిపోయింది. శ్రీముఖి, వరుణ్ సందేశ్, వితిక, శివజ్యోతి, జాఫర్ లాంటి ప్రముఖ సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. 

 

ఏడుగురిని ప్రేమించా.. ఒక్కరిని కూడా పెళ్లిచేసుకోకపోవడానికి కారణం అదే!

శృంగార తారగా ఒకప్పుడు షకీలాకు ఉన్న క్రేజే వేరు. ముఖ్యంగా 90 వ దశకంలో షకీలాకు ప్రధాన పాత్రలో అనేక రొమాంటిక్ చిత్రాలు వచ్చాయి. షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్ హీరోల సినిమాలకు కూడా గుబులే. అలా ఉండేది షకీలా హవా. ప్రస్తుతం షకీలాకు అవకాశాలు రావడం లేదు. 

 

ఇండియన్ ఇండస్ట్రీని తక్కువ చేసిన రాధికా ఆప్టే!

హాలీవుడ్ లో నటులు తమ డబ్బు కోసం అడుక్కోవాల్సిన అవసరం ఉండదని చెప్పింది రాధికా ఆప్టే. హాలీవుడ్ జనాలు ప్రతీ విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారని.. సరైన సమయంలో పేమెంట్ చేస్తుంటారని.. నా డబ్బులు ఇవ్వండని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండదని చెప్పుకొచ్చింది. 

 

శ్రద్ధా ఆన్సర్ తో అప్సెట్ అయిన ప్రభాస్ ఫ్యాన్స్..!

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' సినిమా తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి క్రేజ్ పెరగడంతో ఆయన నటిస్తోన్న తదుపరి సినిమా 'సాహో'పై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి.

 

క్రికెటర్ మాజీ ప్రేయసి అంటే ఫైర్ అయిపోతున్న హీరోయిన్!

 'ఊర్వశి తన మాజీ ప్రియుడు హర్థిక్ పాండ్య సాయం కోరారా..?' అని ఓ వార్త రాసింది హిందీ మీడియా. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఊర్వశి దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఫైర్ అయింది.  

 

'కథలు రెడీ చేసుకోండి..' దర్శకనిర్మాతలకు పవన్ సంకేతాలు..?

తీసుకున్న అడ్వాన్స్ లకి లెక్క చెప్పడం కోసమో, మళ్లీ అభిమానులను అలరించడం కోసమే తెలియదు కానీ మరోసారి తన ముఖానికి మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నాడట పవన్. మైత్రి మూవీ మేకర్స్, డీవీవీ దానయ్య, రత్నం వంటి అగ్ర నిర్మాతల అడ్వాన్స్ లు పవన్ దగ్గర ఉన్నాయి.

 

'బిగ్ బాస్'కి సెక్స్, హగ్గులు, ముద్దులే కావాలి.. శ్వేతారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా ఉన్న ‘బిగ్ బాస్’ షో సీజన్ 3పై యాంకర్ శ్వేతారెడ్డి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం విశాఖపట్నంలో ప్రెస్ మీట్ నిర్వహించిన శ్వేతారెడ్డి ఈ రియాలిటీ షోపై విరుచుకుపడ్డారు.
 

త్రివిక్రమ్, బన్నీ సినిమా నుండి రావు రమేష్ అవుట్..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రావు రమేష్ కి వేషం పడింది. అయితే ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారని సమాచారం. ఆయన ప్లేస్ లో నటడు, దర్శకుడు అమృతం ఫేమ్ హర్షవర్ధన్ ని తీసుకున్నారని తెలుస్తోంది. 

 

బిగ్ బాస్ 3: ఈ వారం ఎలిమినేషన్ లో శ్రీముఖే టార్గెట్!

బిగ్ బాస్ సీజన్ 3 ఎనిమిది ఎపిసోడ్‌‌లను ముగించుకుని సోమవారం ఎపిసోడ్‌కి ఎంటర్ అయ్యింది. 15 మంది కంటెస్టెంట్స్‌లో ఆరుగురు ఈవారం ఎలిమినేషన్ జోన్‌లో ఉండటంతో ఆసక్తికరంగా నేటి (జూలై 29) ఎపిసోడ్ ప్రారంభమైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
 

 

మెగాఫోన్ పట్టనున్న స్టార్ హీరోయిన్...త్వరలోనే ప్రకటన!

అనుపమ ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా చేస్తోంది. ఈ సినిమాలో 'మహానటి' సినిమా హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నాడు. ఆ టీమ్ తో పనిచేస్తూ.. మరోపక్క బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు చిత్రం పూర్తి చేసింది. అయితే ఆమె దృష్టి అంతా డైరక్షన్ మీదే ఉందట. త్వరలోనే ఓ సినిమా డైరక్ట్ చేయబోతున్నానని చెప్తోంది. 

 

డిప్రెషన్ లో ఉన్నారా... రెడ్ వైన్ తో పరిష్కారం

రెడ్ వైన్ ని ద్రాక్ష పండ్లతో తయారు చేస్తారు. కాగా...ద్రాక్షలో ఉండే ఓ పదార్థం డిప్రెషన్ పోవడానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని ఎలుకలపై జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైంది. డిప్రెషన్, యాంగ్జైటీలను ప్రేరేపించే ఎంజైమ్ ను రెడ్ వైన్ లో ఉండే రిస్వరట్రాల్ అడ్డుకుందని పరీక్షలో వెల్లడైంది.
 

 

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

బెంగుళూరు: కేఫ్ కాఫీ డే అధినేత సిద్దార్ద మిస్సింగ్‌పై ఓ మత్స్యకారుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నదిలో చేపలు పడుతున్న సమయంలో నేత్రావతి నదిలోని 8వ పిల్లర్ వద్ద బ్రిడ్జి పై నుండి ఓ వ్యక్తి నదిలోకి దూకడం చూసినట్టుగా తెలిపారు. 

 

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

బెంగుళూరు: కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్దార్ధ అదృశ్యంపై కారు డ్రైవర్  పోలీసులకు కీలక సమాచారాన్ని అందించారు. సిద్దార్ధ కారు డ్రైవర్‌గా బసవరాజ్ పాటిల్ గత మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. 

 

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

సోమవారం సాయంత్రం నేత్రావది నది సమీపంలో ఆయన కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. వ్యాపారంలో నష్టపోయాననే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన అదృశ్యం కావడానికి ముందు కంపెనీ ఉద్యోగులకు లేఖ రాయడంతో ఈ అనుమానానికి బలం చేకూరుతోంది.

 

‘‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం.కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయన అదృశ్యమైనట్లు అందరూ భావించారు. కానీ... ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. ఆత్మహత్యకు ముందు తన కేఫ్ కాఫీ డే బోర్డు మెంబర్స్ ని ఉద్దేశించి  ఆయన ఓ లేఖ రాశారు.

 

ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ ఆత్మహత్య..?

కనిపించకుండా పోయిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్ధ ఏమైయ్యారన్న దానిపై అనేక  అనుమానాలు కలుగుతున్నాయి. వంతెనపై నడుచుకుంటూ వెళ్లి ఆ తర్వాత కనిపించకుండా పోవడం, కంపెనీ ఉద్యోగులకు లేఖ రాయడంతో సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్నారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

 

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం. కృష్ణ అల్లుడు, కేఫ్ కాఫీ డే అధినేత వి.జి. సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం మంగుళూరు నేత్రావతి నది వంతెనపై వెళుతుండగా డ్రైవర్‌ని కారు పక్కకు ఆపాలని ఆదేశించారు. అనంతరం కారు దిగి వంతెనపై నడుచుకుంటూ వెళ్లారు.

 

 

 

click me!