చంద్రబాబుకు ఆగస్టు ఫీవర్: ఫిరాయింపులకు నేతలు రెడీ

First Published 30, Jul 2019, 12:17 PM

శ్రావణ మాసంలో అంతా సందడే ఉంటుందంటూ బీజేపీ నేతలు ఆశతో ఉన్నారు. ఆగష్టు వస్తోందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. 

శ్రావణ మాసంలో అంతా సందడే అంటూ బీజేపీ నేతలు ఉత్సాహంతో ఉన్నారు. ఆగష్టు మాసం వస్తోందని టీడీపీ నేతలకు గుబులు పట్టుకొంది. టీడీపీలో ఆగష్టు మాసంలోనే గతంలో సంక్షోభాలు చోటు చేసుకొన్నాయి. ఈ కారణంగానే  తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు.

ఏపీ రాష్ట్రంలో బీజేపీ నేతలు టీడీపీకి గాలం వేస్తున్నారు. ఇప్పటికే నలుగురు టీడీపీ ఎంపీలు రాజ్యసభలో టీడీపీపీని  బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం చేశారు. పలువురు టీడీపీ నేతలకు కూడ బీజేపీ నేతలు వల వేస్తున్నారు.

టీడీపీకి చెందిన మాజీ మంత్రులు,  మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆయా ప్రాంతాల్లో బలమున్న నేతలతో బీజేపీ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

మాజీ కేంద్ర మంత్రి సుజనాచౌదరి టీడీపీ నేతలను బీజేపీలో చేర్పించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కొందరు టీడీపీ నేతలు కూడ కమలం వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

శ్రావణ మాసంలో పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఆషాడ మాసంలో మంచి రోజులు లేనందున వలసలకు బ్రేక్ పడింది. మంచి ముహుర్తం చూసుకొని బీజేపీలో చేరేందుకు టీడీపీ నేతలు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.

శ్రావణ మాసంలో  అంతా సందడే ఉంటుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెబుతున్నారు. టీడీపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక టీడీపీ నేతలకు ఆగష్టు మాసం వస్తోందంటే భయం పట్టుకొంది. ఆగష్టు మాసంలోనే టీడీపీ సంక్షోభాలకు గురైంది. ఎన్టీఆర్ ను గద్దెదించి నాదెండ్ల భాస్కర్ రావు సీఎం పదవిలో కూర్చొంది ఆగష్టులోనే. 1995 ఆగష్టు మాసంలోనే చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను దించాడు. సెప్టెంబర్ 1వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాడు.

ప్రస్తుతం ఆగష్టు మాసంలోనే టీడీపీకి చెందిన కొందరు నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో టీడీపీకి మరో ఆగష్టు సంక్షోభం తప్పదా అనే చర్చ కూడ లేకపోలేదు.

టీడీపీతో పాటు వైఎస్ఆర్‌సీపీకి చెందిన అసంతృప్త నేతలపై బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.  వచ్చే ఎన్నికల నాటికి  ఆంధ్రప్రదేశ్ లో  అధికారంలోకి రావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఈ మేరకు టీడీపీకి చెందిన నేతలకు ఆ పార్టీ వల వేస్తోంది.

loader