యాంకర్ శ్వేతారెడ్డి కొద్దిరోజులుగా బిగ్ బాస్ షోని టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తనతో అగ్రిమెంట్ చేయించుకొని.. చివరి నిమిషంలో తప్పించారని.. తనను లైంగికంగా వేధించారని ఆరోపణలు చేసింది శ్వేతారెడ్డి. సుమారు 150 మందితో బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదింపులు జరిపారని.. వాళ్లందరినీ మోసం చేశారని ఆరోపణలు చేసింది. 

సోమవారం నాడు వైజాగ్ లోని మహిళా మండలి సభ్యుల సౌజన్యంతో ధర్నా మొదలుపెట్టారు. అయితే వాతావరణం సహకరించకపోవడంతో ధర్నాను రద్దు చేసుకొని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బిగ్ బాస్ షో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎంపిక విషయంలో అన్యాయం జరగడం ఒక్కటే కాదని.. వాళ్లు లేవదీసిన ప్రశ్నలు కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు.

తన విషయంలో బిగ్ బాస్ ని ఎలా సాటిస్ఫై చేస్తారని అడిగారని.. పదే పదే అదే ప్రశ్న అడగడంతో తనకు చిరాకొచ్చిందని తెలిపింది. అదొక రియాలిటీ షో అని. అక్కడ ఎవరి టెంపర్ ఎలా ఉంటుంది..? మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది..? టాస్క్ లు ఇచ్చినప్పుడు వాళ్ల రియాక్షన్ ఎలా  ఉంటుందనే వాటిపై ప్రశ్నలు సంధించాలి కానీ సెక్సుల గురించి,  హగ్గుల గురించి, ముద్దుల గురించి అడగడమేంటని ప్రశ్నించింది. 

తొంబై రోజులు సెక్స్ లేకుండా మీరు ఎలా మేనేజ్ చేయగలరనే..? చెత్త ప్రశ్నలను అడుగుతున్నారని.. తనతో పాటు గాయత్రీ గుప్తా, శ్రీరెడ్డిలను కూడా అడిగారని మండిపడింది. ఈ పోరాటం తీవ్ర రూపం దాల్చబోతోందని, ఇది పబ్లిసిటీ స్టంట్ కాదని వెల్లడించింది.