ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాన్ పిక్ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్ ని సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రన్ అల్ ఖైమాకు చెందిన ప్రతినిధుల ఫిర్యాదుతో బెల్ గ్రేడ్ లో నిమ్మగడ్డను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

వాన్ పిక్ వాటాల వ్యవహారంలో నిమ్మగడ్డ పై రన్ అల్ ఖైమా ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితమే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుగా... ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెర్బియాకు ఆయన విహారయాత్రకు వెళ్లి అక్కడ పోలీసులకు చిక్కడం విశేషం.

అయితే... నిమ్మగడ్డ ప్రసాద్ ని భారత్ కి రప్పించేందుకు వైసీపీ ఎంపీలు తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కూడా వారు కోరుతున్నారు. సెర్బియాతో సంప్రదింపులు జరిపి.. నిమ్మగడ్డను సురక్షితంగా భారత్ కి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని విదేశాంగమంత్రి జైశంకర్ కు వైసీపీ ఎంపీలు లేఖ రాశారు.

కాగా నిమ్మగడ్డ ప్రసాద్ కి వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.