మలయాళ 'ప్రేమమ్' సినిమాతో  పాపులర్ అయ్యిన అనుపమ పరమేశ్వరన్ కు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలొచ్చాయి.  అయితే హీరోయిన్‌గా సక్సెస్ అయ్యింది మాత్రం మన టాలీవుడ్ లోనే. తెలుగులో త్రివిక్రమ్ తీసిన ఆఆ , ప్రేమం, శతమానం భవతి సినిమాలతో ఒక్కసారిగా స్టార్ అయ్యింది. ఆతర్వాత వచ్చిన కృష్ణార్జున యుద్ధం, ఇంటిలిజెంట్ వంటి సినిమాలు అట్టర్‌ప్లాప్ అవ్వటంతో... దాంతో ఆమె క్రేజ్ కొంత తగ్గింది. సినిమాలు కూడా తగ్గాయి. ఈ గ్యాప్‌లో ఆమె ఏం చేస్తోంది. అంటే ఓ సినిమా డైరక్ట్ చేయటానికి రంగం సిద్దం చేసుకుంటోంది. 

అందుకోసం అనుపమ ఓ మలయాళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా చేస్తోంది. ఈ సినిమాలో 'మహానటి' సినిమా హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నాడు. ఆ టీమ్ తో పనిచేస్తూ..మరో  ప్రక్క బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు చిత్రం పూర్తి చేసింది. అయితే ఆమె దృష్టి అంతా డైరక్షన్ మీదే ఉందిట. త్వరలోనే ఓ సినిమా డైరక్ట్ చేయబోతున్నానని చెప్తోంది. 

అంతర్గతవర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అనుపమ ఇప్పటికే ఓ ఫిమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ ని రెడీ చేసుకుంది. నిర్మాత, హీరోయిన్ సెట్ కాగానే ప్రకటన వచ్చే అవకాసం ఉంది. అయితే ఈ లోగా నటిగా  తను ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసాకే దృష్టి పెడుతుందిట. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలో చేస్తోంది. అనుపమ డైరక్ట్ చేసే సినిమా నాలుగు భాషల్లో ఉంటుందిట. తెలుగు,తమిళ, మళయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉందని సమాచారం. బెస్టాఫ్ లక్ అనుపమ.