హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ముఖేష్ గౌడ్ అంత్యక్రియలు  మంగళవారం నాడు అధికారిక లాంఛనాలతో షేక్‌పేటలోని స్మశానవాటికలో పూర్తయ్యాయి.

మంగళవారం నాడు ఉదయం ముఖేష్ గౌడ్ నివాసం నుండి ఆయన పార్థీవ దేహన్ని గాంధీభవన్ కు తరలించారు.గాంధీ భవన్ లో పార్టీ నేతలు, కార్యకర్తలు గాంధీభవన్ లో ముఖేష్ గౌడ్ కు నివాళులర్పించారు.

గాంధీ భవన్ నుండి  ముఖేష్ గౌడ్ పార్థీవ దేహన్ని షేక్‌పేట స్మశాన వాటికకు తీసుకొచ్చారు. షేక్‌పేట స్మశానవాటికలో అధికార లాంఛనాలతో  అంత్యక్రియలు నిర్వహించారు.సోమవారం మధ్యాహ్నం ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముఖేష్ గౌడ్ మృత్యువాత పడ్డారు.2004, 2009లలో ఆయన మంత్రిగా పనిచేశారు. గ్రేటర్ హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ముఖేష్ గౌడ్ కీలకపాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు

గ్రేటర్ లో ఒకప్పుడు చక్రం తిప్పిన ముఖేష్

దేవేందర్ గౌడ్ సమీప బంధువే ముఖేష్ గౌడ్

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూత

ముఖేష్ గౌడ్ అరుదైన చిత్రాలు

ముఖేష్ గౌడ్ మృతి: మంత్రి శ్రీనివాస్ గౌడ్ నివాళులు (వీడియో)

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ ఆరోగ్యం విషమం: ఐసీయూలో చికిత్స