MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • Fact Check: ప్రధాని మోదీ రాజీనామా చేశారా.? వైరల్ లేఖపై కేంద్రం క్లారిటీ.. అసలు నిజం ఇదే

Fact Check: ప్రధాని మోదీ రాజీనామా చేశారా.? వైరల్ లేఖపై కేంద్రం క్లారిటీ.. అసలు నిజం ఇదే

Fact Check: ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేశారంటూ సోషల్ మీడియాలో ఓ లేఖ వైరల్ అవుతోంది. అశోక చక్రం గుర్తు, ప్రధాని సంతకం ఉన్నట్లు కనిపించే ఈ లేఖను చూసి చాలామంది నిజమేనని నమ్ముతున్నారు. అయితే ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 30 2026, 09:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సోషల్ మీడియాలో వైరల్ అయిన రాజీనామా లేఖ
Image Credit : Narendra modi/X

సోషల్ మీడియాలో వైరల్ అయిన రాజీనామా లేఖ

ఇటీవల పలు సోషల్ మీడియాల్లో ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేసినట్లు పేర్కొంటూ ఒక లేఖ విస్తృతంగా షేర్ అయింది. వ్యక్తిగత, రాజకీయ బాధ్యతలను స్వీకరిస్తూ ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారిక లేఖ మాదిరిగా కనిపించడం, ప్రధాని సంతకం ఉన్నట్లు చూపించడం వల్ల చాలామంది దానిని నిజమని భావించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పీఐబీ ఫ్యాక్ట్ చెక్.. లేఖ పూర్తిగా నకిలీ
Image Credit : Asianet News

పీఐబీ ఫ్యాక్ట్ చెక్.. లేఖ పూర్తిగా నకిలీ

ఈ వైరల్ లేఖపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టత ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇలాంటి ఎలాంటి రాజీనామా లేఖ విడుదల చేయలేదని, వైరల్ అవుతున్న పత్రం పూర్తిగా నకిలీ అని తెలిపింది. మోదీ సంతకం పేరుతో ప్రచారం చేస్తున్న లేఖకు ఎలాంటి అధికారిక గుర్తింపు లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో కనిపించే ఇలాంటి సమాచారాన్ని షేర్ చేసే ముందు అధికారిక వనరుల ద్వారా తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించింది.

35
మోదీ పేరుతో వైరల్ వీడియోలు కూడా ఫేకే
Image Credit : Asianet News

మోదీ పేరుతో వైరల్ వీడియోలు కూడా ఫేకే

రాజీనామా లేఖ వివాదానికి ముందు కూడా ప్రధాని మోదీ పేరుతో కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై ప్రధాని హెచ్చరికలు చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ వీడియోలు కూడా కృత్రిమ మేథస్సు (AI) సహాయంతో రూపొందించిన నకిలీ వీడియోలేనని పీఐబీ స్పష్టం చేసింది. వాటిలో ఉన్న వ్యాఖ్యలు ప్రధాని చేసినవి కావని వెల్లడించింది.

45
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే ప్రచారం పెరిగింది
Image Credit : ANI

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాతే ప్రచారం పెరిగింది

ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, ముఖ్యంగా నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా, దేశంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజీనామా సమర్పించినట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామం తర్వాతే ప్రధాని మోదీ రాజీనామా చేశారంటూ నకిలీ లేఖ సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది.

सोशल मीडिया पर प्रधानमंत्री नरेंद्र मोदी के हस्ताक्षर वाला एक पत्र प्रसारित किया जा रहा है।#PIBFactCheck

❌ यह पत्र #फर्जी है।

✅ प्रधानमंत्री द्वारा ऐसा कोई पत्र न तो जारी किया गया है और न ही उस पर हस्ताक्षर किए गए हैं।

⚠️ किसी भी दावे पर विश्वास करने से पहले उसकी आधिकारिक… pic.twitter.com/ktqV0aZDaN

— PIB Fact Check (@PIBFactCheck) July 30, 2026

55
అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచన
Image Credit : ANI

అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచన

సోషల్ మీడియాలో కనిపించే ప్రతి సమాచారం నిజం కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దేశ ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం లేదా ఇతర కీలక అంశాలకు సంబంధించిన వార్తలను అధికారిక ప్రభుత్వ ఫ్లాట్ ఫామ్స్, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ వంటి విశ్వసనీయ వనరుల ద్వారా ధృవీకరించిన తర్వాతే నమ్మాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేశారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
భారత దేశం
ఫ్యాక్ట్ చెక్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
Recommended image2
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?
Recommended image3
BRICS Summit : బ్రిక్స్ అతిథులకు వెండి పాత్రల్లో భోజనం... వీటిని చూస్తే వావ్ అనాల్సిందే!
Related Stories
Recommended image1
షాపింగ్ మాల్స్‌లో డ్ర‌స్‌ల‌కు ఉండే ఈ ట్యాగ్‌లు ఏంటో తెలుసా? ఇవి ఎలా ప‌నిచేస్తాయంటే.?
Recommended image2
తెలంగాణ‌లో మినీ ఆదియోగి.. రూ. 15 కోట్ల‌తో అద్భుత పార్క్‌, హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌ర్లోనే.. ఎలా వెళ్లాలంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved