బిగ్ బాస్ సీజన్ 3 రెండో వారంలోకి అడుగు పెట్టింది. తొలివారంలో నటి హేమ ఎలిమినేట్ కాగా.. ఆమె స్థానంలోకి తమన్నా సింహాద్రిని తీసుకొచ్చారు. సోమవారం 
నాడు బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ను కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఇద్దరి పేర్లను నామినేట్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన తమన్నాను నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ ఆదేశించారు.

ఇక నామినేషన్ ప్రారంభమైన తరువాత ఎవరితోనూ చర్చించకూడదనే నిబంధనను పాటించని కారణంగా వరుణ్ సందేశ్ భార్య వితికా.. నామినేషన్ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించారు బిగ్ బాస్. నామినేషన్ ప్రాసెస్ లో బాబా భాస్కర్ ని బిగ్ బాస్ ఇద్దరు పేర్లు చెప్పమని అడిగితే దానికి ఆయన వచ్చిన వారమే అయిందని... ఏదొక కారణంతో ఇద్దరిని నామినేట్ చేయమంటే చేయలేనని చెప్పారు. కావాలంటే తననే నామినేట్ చేసుకోమని చెప్పారు.

ప్రతీ వారం నామినేషన్ జరుగుతుందని.. తప్పకుండా ఇద్దరి పేర్లు చెప్పాలని బిగ్ బాస్ కన్విన్స్ చేసినా.. బాబా భాస్కర్ తగ్గలేదు. దీంతో బిగ్ బాస్.. బాబా భాస్కర్ కి కొంత సమయం  ఇచ్చి ఆలోచించుకోమని చెప్పారు. అప్పటికీ ఇదే సమాధానం చెప్తానని బాబా భాస్కర్ చెప్పడంతో.. బిగ్ బాస్ పేర్లు చెప్పకపోతే నామినేషన్ క్యాన్సిల్ చేసి హౌస్ మొత్తాన్ని ఎలిమినేషన్ కి నామినేట్ చేస్తానని చెప్పారు.

దీంతో బాబా భాస్కర్.. వితికా, రాహుల్ ల పేర్లు చెప్పారు. ఫైనల్ గా ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేశ్, వరుణ్, వితికా,  పునర్నవి, రాహుల్ లు నామినేషన్ లో ఉన్నారు. ఎక్కువ మంది శ్రీముఖి, హిమజలను నామినేట్ చేశారు.