ప్రభాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'సాహో'. బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' సినిమా తరువాత ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి క్రేజ్ పెరగడంతో ఆయన నటిస్తోన్న తదుపరి సినిమా 'సాహో'పై అంచనాలు ఓ రేంజ్ లో ఏర్పడ్డాయి.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న శ్రద్ధాకపూర్ ఇటీవల చేసిన కొన్ని కామెంట్స్ ప్రభాస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాల్గొన్న శ్రద్ధా కపూర్ ని తెలుగులో మీ అభిమాన నటుడు ఎవరని ప్రశ్నించారు. దానికి ఆమె వెంటనే మహేష్ బాబు అని సమాధానమిచ్చింది. ప్రభాస్ గురించి అడిగినప్పుడు అతను తనకు మంచి స్నేహితుడని వెల్లడించింది.

శ్రద్ధాకపూర్ ఇచ్చిన సమాధానాలు ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆగ్రహానికి గురి చేశాయట. నిజానికి ఓ హీరోతో కలిసి నటిస్తున్నప్పుడు ఆయనే తన అభిమాన నటుడని హీరోయిన్ చెప్పాలని ఆ హీరో అభిమానులు కోరుకోవడం కరెక్ట్ కాదు.. ఎవరి అభిప్రాయాలు, ఇష్టాలు వారికి ఉంటాయి. వాటిని మనం గౌరవించాలే తప్ప వేలెత్తి చూపకూడదు. ఇప్పుడు శ్రద్ధాకపూర్.. మహేష్ బాబు పేరు చెప్పినంత మాత్రానా ప్రభాస్ కి ఉన్న క్రేజ్ తగ్గిపోతుందనుకుంటే ఎలా..? ఏదేమైనా ప్రభాస్ అభిమానులు మాత్రం శ్రద్ధా ఆన్సర్ తో సంతృప్తిగా లేరనే చెప్పాలి.

ప్రస్తుతం 'సాహో' సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సుజీత్ డైరెక్ట్  చేస్తోన్న ఈ సినిమా ఆగస్ట్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.