జనసేనలో నాదెండ్ల మనోహర్ చిచ్చు: పవన్ కల్యాణ్ కు ప్రశ్నలు

First Published 30, Jul 2019, 12:21 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రశ్నల పరంపర ఎదురవుతోంది. పార్టీలో నాదెండ్ల మనోహన్ నెంబర్ టూ స్థానం పొందినట్లేనని భావిస్తున్నారు. అయితే, నాదెండ్ల మనోహర్ ను ఒక్కడినే ప్రతి చోటికీ తీసుకు వెళ్తూ పవన్ కల్యాణ్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇస్తున్నారంటూ విమర్శలు ప్రారంభమయ్యాయి.

నాదెండ్ల మనోహర్ కు ఇస్తున్న ప్రాధాన్యంపై శ్రీధర్ అడ్డేపల్లి ట్విట్టర్ వేదిక వ్యాఖ్యలు చేసి చర్చకు ఊపిరిపోశారు. నాయకుడు ప్రతి ఒక్కరిని వెంట నడిపించుకుని వెళ్లాలని, ఒక్కరినే తన వెంట నడిపించుకుని వెళ్లడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు

శ్రీధర్ అడ్డేపల్లి దాంతో ఆగకుండా పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల పేర్లు కూడా చెప్పారు. జెడి (లక్ష్మినారాయణ), తోట చంద్రశేఖర్, భరత్ భూషణ్, శేఖర్ పులి, తదితర నాయకులు ఉన్నారని, వారిని విస్మరించకూడదని ఆయన అన్నారు. వారిని విస్మరిస్తే మూల్యం చెల్లించే తప్పిదమవుతుందని ఆయన అన్నారు. దానికి నాదెండ్ల మనోహర్ ను తీసుకుని వెళ్లి పవన్ కల్యాణ్ అప్పటి గవర్నర్ నరసింహన్ ను కలిసిన ఫొటోను జత చేశారు. అంతేకాకుండా చిరంజీవితో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ భేటీ అయిన ఫొటోను కూడా జత చేశారు

నాదెండ్ల మనోహర్ పై మరో తీవ్రమైన వ్యాఖ్య కూడా శ్రీధర్ అడ్డేపల్లి చేశారు. పార్టీలో నెంబర్ 2గా ప్రజలు భావిస్తున్న నాయకుడు తన తండ్రిని ప్రభావితం చేయలేకపోయారని ఆయన నాదెండ్ల మనోహర్ ను ఉద్దేశించి అన్నారు. తన తండ్రి బిజెపిలో చేరకుండా చూడలేకపోయారని అన్నారు. నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర రావు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే

శ్రీధర్ అడ్డేపల్లి ఎన్నికలకు ముందు బిజెపికి రాజీనామా చేసి జనసేనలో చేరారు. పార్టీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి గురై జనసేన నుంచి కూడా తప్పుకున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. జనసేనకు రాజీనామా చేసి బిజెపిలో చేరిన విజయబాబు కూడా పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ప్రశ్నించారు

loader