బెంగుళూరు: కేఫ్ కాఫీ డే అధినేత వీజీ సిద్దార్ధ అదృశ్యంపై కారు డ్రైవర్  పోలీసులకు కీలక సమాచారాన్ని అందించారు. సిద్దార్ధ కారు డ్రైవర్‌గా బసవరాజ్ పాటిల్ గత మూడేళ్లుగా పనిచేస్తున్నాడు. 

 

టయోటా ఇన్నోవాలో బెంగుళూరు నుండి సఖిలేష్‌పూర్‌కు వెళ్లమని డ్రైవర్‌కు చెప్పి సిద్దార్ధ కారు ఎక్కారు. బెంగుళూరు నుండి సఖిలేష్ పూర్‌కు 220 కి.మీ. అయితే కొంత దూరం వెళ్లిన తర్వాత సిద్దార్ద మనసు మార్చుకొని కారును మంగుళూరు వైపుకు తీసుకెళ్లమని చెప్పాడని డ్రైవర్  పోలీసులకు చెప్పాడు. 

మంగుళూరుకు సమీపంలోని నేత్రావది నదిపై ఉన్న బ్రిడ్జి సమీపించగానే కారును ఆపాలని సిద్దార్ధ తనకు చెప్పినట్టుగా డ్రైవర్ పోలీసులకు చెప్పారు. కారును బ్రిడ్జి చివరి వరకు తీసుకెళ్లి  వేచి చూడాలని తనకు  చెప్పాడని పోలీసులకు డ్రైవర్ చెప్పినట్టుగా సమాచారం. గంటసేపు ఎదురుచూసిన తర్వాత తాను పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా డ్రైవర్ చెప్పాడు. 

డాగ్ స్క్వాడ్ బ్రిడ్జి మధ్యకు వెళ్లి ఆగిపోయింది.  అయితే అక్కడి నుండి సిద్దార్ధ నదిలో దూకి ఉంటాడని  పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం రాత్రి 7 గంటలకు నేత్రావతి బ్రిడ్జి వద్దకు సిద్దార్ధ చేరుకొన్నాడు. ఆ తర్వాత నుండి ఆయన కన్పించడం లేదు. 

సంబంధిత వార్తలు

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...